ETV Bharat / state

పచ్చని పండుగ: రెండోరోజూ జోరుగా సాగిన హరితహారం - హరితహారం తాజా వార్తలు

ఆరో విడత హరితహారం రెండో రోజు జోరుగా సాగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు పలు చోట్ల మొక్కలు నాటారు. మొక్కలు నాటినంత మాత్రాన బాధ్యత పూర్తవదని.. వాటిని సంరక్షించి మహా వృక్షాలుగా మలచినప్పుడే ప్రయోజనమని మంత్రులు మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా.. మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

second-day-haritha-haram-program-in-telangana
పచ్చని పండుగ: రెండోరోజూ జోరుగా సాగిన హరితహారం
author img

By

Published : Jun 26, 2020, 7:30 PM IST

Updated : Jun 26, 2020, 10:10 PM IST

పచ్చని పండుగ: రెండోరోజూ జోరుగా సాగిన హరితహారం

అడవులకు పునరుజ్జీవం తేవాల్సిన అవసరం ఉందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. లేదంటే ఐదేళ్లలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్న శాస్త్రవేత్తల ఆందోళనల్ని మంత్రి గుర్తుచేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు ఈద్గాలో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటితో కలిసి హరీశ్‌రావు మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్​ మానస పుత్రికని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభివర్ణించారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ పార్క్‌, బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్క్‌లో మంత్రి మొక్కలు నాటారు.

హరితతెలంగాణ లక్ష్యంగా...

నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి హరితహారంలో పాల్గొన్నారు. అద్దంకి-నార్కట్ పల్లి జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. మిర్యాలగూలోనూ ఎమ్మెల్యే భాస్కరరావుతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఎన్ని మొక్కలు నాటామన్నది ముఖ్యం కాదని.. నాటిన వాటిలో ఎన్ని సంరక్షించామన్నదే ముఖ్యమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిర్మల్ జిల్లా దోలావార్‌పూర్ మండలం కాల్వ గ్రామం వద్ద అటవీ ప్రాంతంతోపాటు ప్రాంతీయ ఆస్పత్రిలో మంత్రి మొక్కలు నాటారు.

హరితశోభితం

మహబూబూబాద్ జిల్లా తొర్రూరు హరితహారంలో భాగంగా మడిపెల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మొక్కలు నాటారు. ములుగు జిల్లా జాకారం, బండారుపల్లి గ్రామాల్లో మంత్రి సత్యవతి రాఠోడ్‌ మొక్కలు నాటారు. కరీంనగర్ జిల్లా సిటీ పోలీస్ శిక్షణా కేంద్రంలో ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శోభారాణితో కలిసి మంత్రి గంగుల కమలాకర్‌ మియావాకి పద్దతిలో మొక్కలు నాటారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి తీరంలో ఎంపీ వెంకటేష్‌ నేతతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మొక్కలు నాటారు. వనపర్తి జిల్లా హరితహారంలో పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి.. గోపాల్‌పేట మండలంలో రైతు వేదికల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద.. మంత్రి పువ్వాడ అజయ్.. ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి మొక్కలు నాటారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు జోరుగా మొక్కలు నాటారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఎమ్మెల్యే గాదరి కిశోర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా వర్దవెల్లి గ్రామంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. మెదక్‌ గ్రంథాలయం వద్ద ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి.. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి.. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మొక్కలు నాటారు. భూపాలపల్లి మంజూరునగర్‌లోని సింగరేణి క్వార్టర్స్‌లో హరితహారానికి జీఎం నిరీక్షణ్ ‌రాజ్ శ్రీకారం చుట్టారు.

ఇవీచూడండి: సిరిసిల్ల జిల్లాలో హరితహారం.. మొక్కలు నాటిన కేటీఆర్‌, పోచారం

Last Updated : Jun 26, 2020, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.