నగర పాలికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక 18 తేదీన ఉండటంతో.. తన వ్యక్తిగత పర్యటనను వాయిదా వేసుకున్నట్టు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆరాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. గతంలో 17 నుంచి 24వ తేదీ వరకు సెలవును కోరినా... ఇప్పుడు వాటిని రద్దు చేసి కొత్త తేదీలతో సెలవు రీషెడ్యూలుకు అనుమతించాల్సిందిగా ఎస్ఈసీ కోరారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు 18న ముగిసిన అనంతరం ఈ నెల 19 నుంచి 22 తేదీ వరకు ఎల్టీసీపై మధురై-రామేశ్వరంలకు వెళ్లనున్నట్టు రాష్ట్ర గవర్నర్‌కు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం.. పీఆర్సీ ఎలా ఇస్తుంది.?: బండి సంజయ్