ETV Bharat / state

ఏపీ ఎస్​ఈసీ వ్యాజ్యంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

నిధుల కోసం అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్​ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ సంస్థలకు సహకరించాల్సిన బాధ్యత మీది కాదా అని నిలదీసిన హైకోర్టు.. ప్రతీదానికి యాచించాలా అంటూ మండిపడింది. రాజ్యాంగ సంస్థలతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో బాగా తెలుసునని వ్యాఖ్యానించింది.

ఏపీ ఎస్​ఈసీ వ్యాజ్యంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఏపీ ఎస్​ఈసీ వ్యాజ్యంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
author img

By

Published : Oct 22, 2020, 7:54 AM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని, సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. రాజ్యాంగ సంస్థలకు సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అన్నింటికీ ప్రభుత్వాన్ని యాచించాలా అని నిలదీసింది. రాజ్యాంగ సంస్థలతో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో తమకు బాగా తెలుసని వ్యాఖ్యానించింది.

అది న్యాయమైన ప్రకటన కాదని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ పేర్కొనగా.. న్యాయమూర్తుల పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో ఈ బెంచ్‌ నుంచే చెప్పేందుకు తాము సిద్ధమని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తేల్చిచెప్పారు. వినేందుకు మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఎస్​ఈసీకి ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు. ప్రభుత్వం ఎలా సహకరించడం లేదో వివరిస్తూ అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్​ఈసీని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో అందులో పేర్కొనాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై గురువారం విచారణ జరుపుతామన్నారు.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. 40 లక్షలకు గానూ రూ. 39,63,600 ప్రభుత్వం జమ చేసిందన్నారు. మిగిలిన రూ. 36,400 ఎందుకు పెండింగ్‌లో ఉంచారో తెలియదన్నారు. ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ స్పందిస్తూ.. ఎస్​ఈసీ కోరిన సొమ్ము చెల్లించామన్నారు. ఇంకా 36,400 ఎందుకు పెండింగ్‌లో ఉంచారో కనుక్కుని చెబుతానన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కౌంటరు వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేయబోయారు.

ఆ బాధ్యత ప్రభుత్వానిదే కదా..

న్యాయవాది అశ్వనీకుమార్‌ స్పందిస్తూ.. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో ఎస్​ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించేలా ఆదేశించాలని అనుబంధ పిటిషన్లో అభ్యర్థించామన్నారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. ఈ అంశంపై కౌంటరు వేస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనుకుంటున్నారో ఎస్​ఈసీ ముందుగా చెప్పాలన్నారు. సహాయ సహకారాలపై ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. రాజ్యాంగ సంస్థలకు సహకారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా, ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగ సంస్థలు అన్నింటికీ మిమ్మల్ని యాచించాలా? అని అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: బుల్లెట్ నర్సన్న కన్నుమూత.. శోకసంద్రంలో తెరాస శ్రేణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.