Seasonal Diseases in Telangana : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో(Seasonal Diseases) జ్వరాల తీవ్రత పెరిగింది. నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ దవాఖానాల్లో వార్డులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసి ఆ తర్వాత వానలు లేకుండా పోయాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది. సీజనల్ వ్యాధులు ప్రబలి పిల్లలకు వాంతులు, విరేచనాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగుజాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
"జ్వరం వస్తోంది పోతోంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్తే నాలుగైదు రోజులకు మందులు ఇచ్చారు కానీ తగ్గడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాము. జ్వరం తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడకి వచ్చాక కొంచెం తగ్గింది. రక్తకణాలు తక్కువగా ఉన్నాయని చికిత్స అందిస్తున్నారు.వేరే ఆసుపత్రులకు వెళ్లి చూయించుకున్నా మళ్లీ ఇక్కడికే పంపిస్తున్నారు." - రోగులు
Fever Patients in Karimnagar Govt Hospitals : జ్వర పీడితులతో కరీంనగర్ (Karimnagar Govt Hospital) ప్రభుత్వ ప్రధానాసుపత్రి కిటకిటలాడుతోంది. దవాఖానాలో 500 పడకలు పూర్తిగా బాధితులతో నిండిపోయాయి. రోగుల రద్దీతో జ్వరం తగ్గకముందే కొందరిని డిశ్చార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరల్ జ్వరాలు వందల సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి. కరీంనగర్ పరిధిలోని కొత్తపల్లి, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, ఇల్లందకుంట, మానకొండూర్, హుజూరాబాద్, శంకరపట్నం మండలాల్లో డెంగీ జ్వరాలు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎవరిని పలకరించినా ప్లేట్‌లెట్లు తగ్గాయని చెబుతున్నారు.
"చాలా మంది పేషెంట్స్ వచ్చారు. రోజుకు 150 మంది పేషెంట్స్‌ను చూస్తున్నాం. అందులో చాలా మందికి డెంగీ జ్వరంతో వస్తున్నారు. ప్రజలు ముందే జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఆసుపత్రిలో బెడ్స్ అన్ని నిండిపోయాయి. దగ్గు, జలుబు, తీవ్రంగా జ్వరం ఉంటే డాక్టర్‌ను పంప్రదించండి." - వైద్యులు
వాతావరణంలో మార్పులకు తోడు పారిశుద్ధ్యం విషయంలో తగుజాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల జ్వరాలు పెరగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి వచ్చే అవుట్ పేషంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో రోజుకు 40మంది వస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు పెరిగింది. వాంతులు, విరేచనాల కేసులు పెరిగాయి. పడకలు సరిపోకపోతే అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఎంతమంది వచ్చినా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసుపత్రి సూపరింటెండ్ చెబుతున్నారు. డెంగీ నిర్ధారణ అయిన ప్రాంతాలను గుర్తించి వ్యాప్తి చెందకుండా దోమల నివారణ చర్యలు, రక్త నమునాల సేకరణ వంటివి చేపట్టాల్సిన అవసరం ఉంది.
Pimples Removal Tips : మొటిమలు, మచ్చలు ఎలా తగ్గించుకోవాలి? టూత్‌పేస్ట్ రాయొచ్చా?
Birth Control Pills Effects : గర్భనిరోధక మాత్రలు వాడితే పిల్లలు పుట్టరా?.. ఇందులో నిజమెంత?