ETV Bharat / state

రైలు ప్రమాదాల నివారణకు సరికొత్త సాంకేతికత

ఇకపై ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఢీకొట్టే ప్రమాదం ఉండదు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. గత నెల 30న ట్రైన్ కొల్యూషన్ అవాయిడెన్స్ సిస్టమ్-టీకాస్‌ను విజయవంతంగా ప్రారంభించింది.

రైలు ప్రమాదాల నివారణకు సరికొత్త సాంకేతికత
రైలు ప్రమాదాల నివారణకు సరికొత్త సాంకేతికత
author img

By

Published : Nov 1, 2020, 7:44 AM IST

రైలు ప్రమాదాలు నివారించే దిశగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ మరో ముందడుగు వేసింది. గత నెల 30న ట్రైన్ కొల్యూషన్ అవాయిడెన్స్ సిస్టమ్-టీకాస్‌ను విజయవంతంగా ప్రారంభించింది. టీకాస్‌ను ప్రారంభించడం భారతీయ రైల్వేలో ఇదే తొలిసారని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

రైలు డ్రైవర్ బ్రేకులు వేయడంలో విఫలమైనపుడు, ప్రమాదకరంగా సిగ్నల్ పాసింగ్ అయినపుడు, రైలు నిర్ధేశించిన వేగాన్ని మించి దూసుకుపోయిన సమయంలో ప్రమాదాలను నివారించడమే టీకాస్‌ ప్రధాన లక్ష్యం. దీనికి అదనంగా నాన్-ఇంటర్ లాక్డ్​ లేదా నాన్ సిగ్నల్స్ ద్వారా జరిగే ప్రమాదాలను నివారిస్తుంది. లోకో పైలట్ కేబిన్​లో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ... మూవ్​మెంట్ ఆథారిటీ, టార్గెట్ స్పీడ్, టార్గెట్ డిస్టెన్స్, సిగ్నల్ ఆస్పెక్ట్ తదితరవి సూచించడం ద్వారా లోకో పైలెట్​కు సహాయకారిగా ఉండనుంది. ఈ వ్యవస్థను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.

1,200 కిలోమీటర్ల పొడవున టీకాస్‌ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ముథ్కేడ్-సికింద్రాబాద్ సెక్షన్‌లో ఉమ్రి-సివున్‌గావ్‌ స్టేషన్ల మధ్య 21.5 కిలోమీటర్ల పొడవు మేర టీకాస్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: జేఎన్‌టీయూహెచ్‌ విస్తరణ కష్టమే.. కొత్త కోర్సులు ఇతర ప్రాంగణాలకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.