లాక్‌డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపారు అధికారులు. సికింద్రాబాద్ నుంచి బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు 10 ప్రత్యేక రైళ్లు బయలుదేరాయి. 10 రైళ్లలో దాదాపుగా 16 వేల మందికి పైగా వలస కార్మికులు వారి సొంతూళ్లకు వెళ్తున్నారు.
సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేసిన అనంతరం వారిని లోనికి అనుమతించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల