తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన టీ-కల్చర్ యాప్‌కు జాతీయ స్థాయిలో స్కోచ్ పురస్కారం రావటం పట్ల... క్రీడా, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... దేశంలోనే ఆన్ లైన్ ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులివ్వటం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ యాప్ రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించిన టీటా డిజిథాన్‌ను మంత్రి అభినందించారు.
తెలంగాణ కళాకారులకు ఈ యాప్ ద్వారా శిక్షణ, వర్క్ షాప్‌లకు సంబంధించిన సమాచారం, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో లబ్ధి వంటి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయని భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వెల్లడించారు.
ఇదీ చదవండి: తన భర్త గురించి హీరోయిన్ కాజల్ మాటల్లో..