ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం గుడిపాడు వద్ద నుండి కలిగిరికి వెళ్లే రోడ్డు వర్షాలకు బురదమయంగా తయారయ్యింది. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు బురదలో ఇరుక్కుంది. దీంతో విద్యార్థులంతా బస్సులో నుంచి దిగగా స్థానికుల సహాయంతో బురదలో ఇరుక్కుపోయిన బస్సును బయటకు తీశారు. రోడ్డు పరిస్థితిపై పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటూ వారు వాపోయారు.
ఇవీ చదవండి: 'పోడు భూముల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం'