ETV Bharat / state

బరువైన బాల్యం.. బడి బ్యాగు భయపెడుతోంది! - PILLALU

ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకోవాల్సిన పిల్లలు పుస్తకాల బరువులు మోయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిమితికి మించి బరువున్న బ్యాగులు మోయడం వల్ల వెన్నుముక దెబ్బతింటోంది. స్కూల్ బ్యాగు బరువుపై కమిటీలు, రిపోర్టులు ఎన్ని ఉన్నా... అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి.

బ్యాగు బరువులతో మగ్గిపోతున్న బాల్యం
author img

By

Published : Aug 28, 2019, 7:59 AM IST

బ్యాగు బరువులతో మగ్గిపోతున్న బాల్యం

ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించిన విద్యార్థులు బడి సంచుల మోతతో వంగి పోతున్నారు. బ్యాగు బరువు మోయలేకపోతున్నామని తల్లిదండ్రులకు చెప్పినా... ఫరవాలేదు నాన్నా అంటూ తల్లిదండ్రులు చెప్పే మాటలతో ఆ భారం తప్పడం లేదు. పుస్తకాలు ఎంత ఎక్కువగా ఉంటే, అంత బాగా చదువు చెబుతారు అన్న ధోరణిలో తల్లిదండ్రులు ఉంటున్నారు. తమ పాఠశాల పేరుతో ముద్రించిన బండెడు పుస్తకాలతో ప్రైవేటు యాజమాన్యాలు బాల్యంపై భారాన్ని పెంచుతున్నాయి. వీటీవల్ల పిల్లల కండరాలపై ఒత్తిడి పడి ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. మరికొందరి పిల్లల్లో వెన్నుముక దెబ్బతిని లేవలేని స్థితికి చేరుకుంటున్నారు.

స్కూల్ బ్యాగు ఎంత బరువు ఉండాలంటే?

నర్సరీ, యల్​కేజీ, యూకేజీ విద్యార్థులు పుస్తకాలు మోయ కూడదు. ఇతర తరగతికి చెందిన విద్యార్థుల బ్యాగుల భారం శరీర బరువు కంటే పది శాతానికి మించకూడదు. చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్టు-2006 ప్రకారం విద్యార్థి శరీర బరువులో పుస్తకాల బరువు 10% మించకూడదు. అంటే 30 కిలోల బరువున్న విద్యార్థి 3 కిలోల బరువున్న బ్యాగు ఉండాలి. ఒకటో తరగతి విద్యార్థి శరీర బరువు 15 కిలోలు ఉంటే.. పుస్తకాల బురువు 1.5 కిలోలు ఉండాలన్న నిబంధన ఉంది. కానీ ప్రస్తుతం ఒకటో తరగతి విద్యార్థి కనీసం ఐదారు కిలోల బరువున్న బ్యాగును మోస్తున్నాడు. ఎనిమిదో తరగతి విద్యార్థి బరువు 30 కిలోల నుంచి 40 కిలోలు ఉంటే... పుస్తకాల బరువు సుమారు 12 కిలోలపైనే ఉంటుంది.

బ్యాగు బరువుకు కారణం

పాఠశాలలో రోజూ జరిగే సిలబస్ పుస్తకాలతోపాటు అసైన్మెంట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జీకే, కంప్యూటర్, డైరీ నోట్, బుక్స్, గైడ్స్, మొదలైన పుస్తకాలతోపాటు హోంవర్క్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్, ఎన్విరాన్మెంట్ సైన్స్, వాటి క్లాస్ రూమ్​వర్క్ నోట్స్ మరియు హోంవర్క్ నోట్స్ ఉంటున్నాయి. ఇలా ఒక పుస్తకానికి 4 నోట్ పుస్తకాలిచ్చే సరికి బ్యాగు బరువు అమాంతంగా పెరిగి పోతోంది. వీటి వల్ల పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే తమ పాఠశాలలోనే పుస్తకాలు కొనాలి అనే నిబంధన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అమలు చేయడం వల్ల పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది.

శారీరక సమస్యలు...

శరీరానికి మించిన బరువు మోస్తుండడం వల్ల చిన్నారుల్లో శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. ఎముకలు, కండరాల పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోంది. శారీరక ఎదుగుదల తగ్గిపోతోంది. చిన్నతనంలోనే వెన్నునొప్పి మొదలవుతోంది. శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ బ్యాగ్ బరువులు ఎక్కువగా మోయడం వల్లే విద్యార్థులకు సమస్యలొస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • స్కూల్ బ్యాగ్ బరువు, రోజు తీసుకురావాల్సిన పుస్తకాలపై, శాస్త్రీయ అంచనాతో తల్లిదండ్రులకు, పాఠశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలు ఇవ్వాలి.
  • కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే స్కూల్ బ్యాగులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
  • మిగిలిన పుస్తకాలు పాఠశాలలోనే దాచుకునే విధంగా ప్రతి విద్యార్థికి సదుపాయం కల్పించాలి.
  • పిల్లల బ్యాగు పొడవు పిల్లల వీపులో 75% కంటే ఎక్కువ భాగం మించకుండా చూసుకోవాలి.
  • రేక్కగూడు ఎముకల నుంచి మధ్య భాగం వరకు బ్యాగు ఉండేలా చూడాలి.
  • నడుము కిందికి బ్యాగు వేలాడేలా ఉండకూడదు. తేలికగా ఉండే బ్యాగులను ఎంచుకోవాలి.
  • భుజానికి తగిలించుకునే బ్యాగుల పట్టీల వెడల్పుగా ఉండాలి.
  • పిల్లలు బ్యాగును ధరించి నడుస్తున్నప్పుడు ముందుకు వంగినట్లు కనిపిస్తే... బ్యాగ్ బరువు ఎక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.
  • బ్యాగులను పిల్లలు సరిగ్గా పైకి ఎత్తుకునేలా చూడాలి.
  • స్కూల్ యాజమాన్యాలు ఇచ్చే పుస్తకాల విషయంలో అవసరం మేరకే ఇంటికి పంపించాలనే విషయాన్ని పాఠశాల సిబ్బందితో చర్చించాలి.

ఇతర రాష్ట్రాల్లో పిల్లల బ్యాగులపై నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఏకంగా విద్యాసంస్థలు ప్రతి శనివారం నో బ్యాగ్ డే ను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. మరి మన రాష్ట్రంలో ఇంకెప్పుడు మోక్షం లభిస్తుందో..

ఇవీ చూడండి: ఊహల పల్లకీలో... దసరాలోపే మంత్రివర్గ విస్తరణ!

Intro:మోయ లేని భారం గా నేటి చదువు.
ఏటా పెరుగుతున్న స్కూలు బ్యాగుల బరువు.
దెబ్బ తింటున్న పిల్లల వెన్నుముక.
తీరుమారని పాఠశాలలు.
అమలుకు నోచుకోని "యశ్ పాల్"నిబంధన.
ఆంధ్రప్రదేశ్ లో వారానికి ఒకరోజు "నో బ్యాగ్ డే".

చిరు ప్రాయం ఆటపాటలతో, ఉల్లాసంగా, మానసికంగా, చదువు కొనాల్సిన వయసులో పిల్లలు, నేడు గంపెడు పుస్తకాలు ఉన్న బ్యాగులను వేసుకొని పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు.
అబ్బా బ్యాగు ఎంత బరువు అని భయపడినా...... మోయక తప్పని భారం.
స్కూల్ బ్యాగు బరువుపై కమిటీలు, రిపోర్టులు ఎన్ని ఉన్నా క్షేత్రస్థాయిలో నామమాత్రపు తనిఖీలతో అవి ఉత్తర్వులు గానే మిగిలిపోతున్నాయి.
పుస్తకాలు ఎంత ఎక్కువగా ఉంటే, అంత బాగా చదువు చెబుతారు అన్న ధోరణిలో తల్లిదండ్రులు...... తమ పాఠశాల పేరుతో ముద్రించిన బైండెడు పుస్తకాలతో ప్రైవేటు యాజమాన్యాలు బాల్యంపై భారాన్ని పెంచు తున్నాయి. బ్యాగు బరువు ఎక్కువ అయితే దాన్ని పిల్లలు వేసుకునేటప్పుడు, ముందుకు వంగడం, పక్కకు తిరగడం, ఒకవైపు వంగడంతో వెన్నుముక ఆకృతి దెబ్బతినడానికి ఇది ఒక కారణం అవుతుంది. కండరాల పైన పైన ఒత్తిడి పడుతుంది, పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

భారం తీరేదెలా:
ఒత్తిడిలేని విద్యను ఆడుతూ పాడుతూ అభ్యసించిన విద్యార్థులు బడి సంచుల మోతతో వంగి పోతున్నారు. బ్యాగు భారం తగ్గించాలని 2006 లో చట్టం వచ్చింది .ఆ చట్టం సరైన దిశగా అమలుకు నోచుకోక విద్యార్థులు బాగుండా పుస్తకాలను మోస్తూ కష్టపడుతున్నారు.

అసలు స్కూల్ బ్యాగు ఎంత బరువు ఉండాలి.
చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్ యాక్టు-2006 ప్రకారం విద్యార్థి శరీర బరువులో పుస్తకాల బరువు 10% మించకూడదు. అంటే 30 కిలోల ఉన్న విద్యార్థి 3 కిలోల బరువుకు సమానంగా బుక్స్ తో నింపిన బాగుండాలి. కానీ నీ 1 వ తరగతి విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే ,పుస్తకాల బరువు 1.5 కిలోలు ఉండాలన్న నిబంధన ఉంది, కానీ దాదాపు ఐదు కిలోల బరువు ఉన్న పుస్తకాలు నేటి విద్య భ్యాసంలో నడుస్తున్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్థి బరువు 30 కిలోల నుంచి 40 కిలోలు ఉంటే..... పుస్తకాల బరువు సుమారు 12 కిలోల పైనే ఉంటుంది. ఇందులో మరొక కారణం కూడా ఉంది, తమ పాఠశాలలో పుస్తకాలు కొనాలి అనే నిబంధన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అమలు చేయడంతో బుక్ సంఖ్య గణనీయంగా పెరిగి ,బ్యాగు బరువు అమాంతం పెరిగిపోతుంది. అంటే దాదాపు శరీర బరువు కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల వెన్నుపై భారం పడి వెన్నుముక వంగి పోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

స్కూల్ బ్యాగ్ పై కమిటీ సూచనలు.
విద్యార్థులు స్కూలు బ్యాగుల బరువు పై గతంలోనే కేంద్ర ప్రభుత్వం యశ్ పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత నివేదిక వెల్లడించింది. దాదాపుగా పాఠశాలల్లో సరైన విద్య బోధిస్తలేరని, ఫలితంగా విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 2006 స్కూల్ బ్యాగ్స్ చట్టం చేశారు.

నిబంధనలు.
నర్సరీ,యల్ కేజీ,యూకేజి విద్యార్థులు పుస్తకాలు మోయ కూడదు. ఇతర తరగతికి చెందిన విద్యార్థుల బ్యాగుల భారం శరీర బరువు కంటే పది శాతానికి మించకూడదు .స్కూల్ బ్యాగ్ బరువు రోజు తీసుకురావాల్సిన పుస్తకాలపై ,శాస్త్రీయ అంచనాతో తల్లిదండ్రులకు, పాఠశాలల యాజమాన్యాలు మార్గదర్శకాలు ఇవ్వాలి. కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే స్కూల్ బ్యాగ్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలి ,మిగిలిన పుస్తకాలు పాఠశాలలోనే దాచుకునే విధంగా ప్రతి విద్యార్థికి ఈ సదుపాయం కల్పించాలి అనే నిబంధన.

నిబంధనలు గాలికి.
కమిటీ సూచనల మేరకు ఏఏ విద్యార్థికి స్కూల్ బ్యాగ్ ఇంత బరువు ఉండాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ను జారీ చేసింది. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఆ తర్వాత "సీసీఈ"మెథడ్ వచ్చాక యశ పాల్ కమిటీ సూచనలను పట్టించుకుంటలేరు. స్కూల్ బ్యాగు మరింత భారమైంది విద్యార్థులకు వెన్నెముక నొప్పి ,తలనొప్పి ,శారీరక రుగ్మతలు ఏర్పడుతున్నాయి.

పుస్తకాల బ్యాగు బరువుకు కారణం ఉంది.
పాఠశాలలో రోజూ జరిగే సిలబస్ పుస్తకాలతో పాటు అసైన్మెంట్, డ్రాయింగ్ ,క్రాఫ్ట్ ,ఆర్ట్ ,జీకే ,కంప్యూటర్ ,డైరీ నోట్, బుక్స్ ,గైడ్స్, మొదలైన పుస్తకాలతోపాటు హోంవర్క్ ఇంగ్లీష్ హిందీ ,తెలుగు ,సైన్స్ ,మ్యాథమెటిక్స్, సోషల్ ,ఎన్విరాన్మెంట్ సైన్స్ అనే పుస్తకాలు ,వాటి క్లాస్ రూమ్స్ వర్క్స్ నోట్స్ మరియు హోంవర్క్ నోట్స్ ఉంటున్నాయి. ఇలా ఒక పుస్తకానికి 4 నోట్ బుక్స్కలిసే సరికి బ్యాగు బరువు అమాంతంగా పెరిగి పోతుంది .దీంతో పిల్లలు అవస్థలు పడుతున్నారు ,కానీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యంలో ఎలాంటి మార్పు రావడంలేదు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. అధికంగా బుక్స్ ఉంటే తల్లిదండ్రులు తమ విద్యా విధానాన్ని గొప్పగా చూస్తారని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

తల్లిదండ్రులది అదే తీరు.
పిల్లల తల్లిదండ్రుల వైఖరి కూడా వింతగా ఉంటుంది. ఎక్కువ పుస్తకాలు ఇచ్చే పాఠశాలలోనే విద్య బాగా చెప్తారని నమ్మడం తో , అసలు సమస్య వస్తున్నట్లు గుర్తించవచ్చు. అడ్మిషన్ తీసుకునే ముందే ఒక్కో సబ్జెక్టుకు ఎన్ని పుస్తకాలు ఇస్తారు ఇంకేమైనా అదనపు పుస్తకాలు ఇస్తారా అని, తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను అడుగుతున్నారు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు పుస్తకాలు తగ్గకూడదనే ధోరణిలో తల్లిదండ్రులు ఆలోచనలే చికాకుగా మారుతున్నాయి.

విద్యార్థులపై వ్యాధుల పంజా.
శరీరానికి మించిన బరువు మోస్తూ ఉండడంవల్ల విద్యార్థుల్లో చిన్నారుల్లో శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. స్కూల్ బ్యాగ్ బరువు అధికంగా ఉండటంతో ఎముకలు ,కండరాల పెరుగుదల పై తీవ్ర ప్రభావం చూపుతోంది. శారీరక ఎదుగుదల తగ్గిపోతుంది, వెన్నునొప్పి చిన్నతనంలోనే మొదలవుతుంది ,శ్వాస సరిగ్గా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది .స్కూల్ బ్యాగ్ బరువు రెండు భుజాలపై సరిగా పడక పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి.
పిల్లల బ్యాగు పొడవు పిల్లల వీపులో 75% కంటే ఎక్కువ భాగం మించకుండా చూసుకోవాలి. రేక్కగూడు ఎముకల నుంచి మధ్య భాగం వరకు బ్యాగు ఉండేలా చూడాలి. నడుము కిందికి బ్యాగు వేలాడేలా ఉండకూడదు. తేలికగా ఉండే బ్యాగులను ఎంచుకోవాలి, భుజానికి తగిలించుకునే బ్యాగుల పట్టీల వెడల్పుగా ఉండాలి, రెండు పట్టీలు ఉన్న బ్యాగులను ఎంచుకోవాలి, పిల్లలు బ్యాగును ధరించి నడుస్తున్నప్పుడు ముందుకు వంగినట్లు కనిపిస్తే, బ్యాగ్ బరువు ఎక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. బ్యాగులను పిల్లలు సరిగ్గా పైకి ఎత్తుకునేలా చూడాలి. స్కూల్ యాజమాన్యాలు ఇచ్చే పుస్తకాల విషయంలో అవసరం మేరకే ఇంటికి పంపించాలనే విషయాన్ని పాఠశాల సిబ్బందితో చర్చించాలి.

ఇతర రాష్ట్రాల్లో పిల్లల బ్యాగుల పై నిబంధనలను అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా విద్యాసంస్థలు ప్రతి శనివారం నో బ్యాక్ డే ను పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మూత నుంచి కొంత ఉపశమనం కలిగించారు.

బైట్స్.
1. మధుసూదన్.
2. నాగరాజు.
3. మారుతి.
4. ప్రభాకర్.
5. రమేష్.
6. నరేష్ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యాధికారి.

Body:యం.శివప్రసాద్, మంథని.

Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.