ETV Bharat / state

Sputnik V: టీకా పేరుతో మోసాలు - డాక్టర్ రెడ్డీస్ వార్తలు

మనదేశంలో రష్యా టీకా ‘స్పుత్నిక్‌ వి’ పంపిణీకి సంబంధించి పూర్తి హక్కులు తమవేనని డాక్టర్‌ రెడ్డీస్‌ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఏ ఇతర సంస్థతో తాము జట్టుకట్టలేదని, ఈ విషయంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని పేర్కొంది.

scams-in-the-name-of-sputnik-v-vaccine
Sputnik V: టీకా పేరుతో మోసాలు
author img

By

Published : May 29, 2021, 9:53 AM IST

‘మన దేశంలో మొదటి 25 కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి టీకా పంపిణీ హక్కులు డాక్టర్‌ రెడ్డీస్‌కే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వేరువేరు సంస్థలు/ వ్యక్తులు స్పుత్నిక్‌ వి టీకా పంపిణీకి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. వాటిని నమ్మొద్దు’’ అని డాక్టర్‌ రెడ్డీస్‌ వివరించింది. ఇటువంటి అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. స్పుత్నిక్‌ వి టీకా పంపిణీకి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు, దీనికి సంబంధించి శీతల నిల్వ- రవాణా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేసింది. వచ్చే నెలలో ఈ టీకాను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది.

అపోలో ఆసుపత్రుల్లో స్పుత్నిక్‌ వి టీకా

దేశవ్యాప్తంగా ఉన్న అపోలో ఆసుపత్రుల్లో స్పుత్నిక్‌ వి టీకా ఇవ్వడానికి అపోలో హాస్పిటల్స్‌ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల రెండో వారం నుంచి టీకా పంపిణీ మొదలు పెట్టనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ వర్గాలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక్కో టీకా డోసుకు జీఎస్‌టీ కలిపి డాక్టర్‌ రెడ్డీస్‌ రూ.995 ధర నిర్ణయించింది. అపోలో హాస్పిటల్స్‌, దీనికి అదనంగా కొంత సర్వీస్‌ ఛార్జీ వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: కొవిడ్​కు డీఎన్​ఏ ఆధారిత టీకా- తొలి ట్రయల్ సక్సెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.