టీఆర్టీ నియామకాల్లో రోస్టర్ (ఎస్సీ,ఎస్టీ, బీసీ) పద్ధతిని పాటించకపోవడాన్ని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. వీరికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కౌన్సెలింగ్లో రోస్టర్ కమ్ మెరిట్ అనే ప్రాతిపదికన స్థానాలు కేటాయించాల్సి ఉంటే రోస్టర్ అండ్ మెరిట్ కింద ఖాళీలు భర్తీ చేశారని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నష్టపోయారన్నారు.
గత నోటిఫికేషన్లో ఎక్కడ రోస్టర్ ముగిసిందో.. ఇప్పడు ఏ సంఖ్య వద్ద ప్రారంభమైందో ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేత కొంగల వెంకట్ విజ్ఞప్తి చేశారు. తక్షణమే రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రాష్ట్ర, జాతీయ కమిషన్లతోపాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కేసీఆర్ పలుకులు వినడానికేనా సభ: భట్టి