తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.ఆర్. మీనా పదవీ విరమణ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. బషీర్బాగ్ పరిశ్రమల భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉద్యోగులు మీనాను ఘనంగా సన్మానించారు.
తన పదవి కాలంలో నిబద్ధతతో పని చేసి మీనా మంచి పేరు తెచ్చుకున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. అనేక అనుమానాలను నివృత్తి చేయడమే కాకుండా భూముల తగాదాలు లాంటి వాటిపై సలహాలు ఇచ్చారని తెలిపారు. అనుభవజ్ఞులైన మీనా ఇచ్చిన సూచనలతో కమిషన్ను భవిష్యత్తులో మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : ఈ-పాస్ విధానంలో పాఠశాలలకు సన్న బియ్యం సరఫరా