ETV Bharat / state

'కులం, మతం పేరుతో భాజపా రెచ్చగొడుతోంది' - sc, st, bc community's meeting

హైదరాబాద్‌ బంజారాహిల్స్​లో... వివిధ సంఘాల నేతలు సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. ఈ నెల 14న రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

telangana latest news
మహాత్మా జ్యోతి రావు ఫూలేకు నివాళి
author img

By

Published : Apr 12, 2021, 2:02 AM IST

రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని పలు దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్​లోని ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం, తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన భాజపా, మావోయిస్టులు కలసి అమాయక ప్రజలను, పోలీసులను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. భాజపా కులం, మతం పేరుతో రెచ్చగొడుతూ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందన్నారు. అందులో భాగంగానే ఎన్నికలు జరిగే సమయంలోనే ఇతర దేశాలతో యుద్ధాన్ని తీసుకురావడం, మత కలహాలకు ప్రేరేపించడం చేస్తూ వస్తున్నారని వివరించారు. చివరకు ఎన్‌కౌంటర్లను సైతం రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఐక్యం చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు నడుం బిగించాలని కోరారు.

రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని... ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. అందులో భాగంగానే ఈ నెల 14న బ్లూ షర్ట్స్ - నీలి కవాతు నిర్వహిస్తున్నామని పిడమర్తి రవి తెలిపారు. నిజాం కాలేజ్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్​పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు కవాతు కొనసాగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నీలి కవాతులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం బ్లూ షర్ట్స్- నీలికవాతు పోస్టర్​ను ఆవిష్కరించారు.

ఇదీ చదవండి: నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.