ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చల్లా ధర్మారెడ్డి పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఓయూ జేఏసీ నాయకులు పోలీస్ స్టేషన్లో వినతి పత్రం ఇచ్చారు. జేఏసీ ఛైర్మన్ దుర్గం భాస్కర్ ఆధ్వర్యంలో ఓయూ దళిత గిరిజన విద్యార్థి సంఘాలతో కలిసి పోలీసులకు లేఖ అందించారు.
ధర్మారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఓయూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని స్పష్టం చేశారు. ధర్మారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓయూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ యథాతథం'