ETV Bharat / state

CM KCR: 'ఎస్సీ సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం' - telangana latest news

అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో గుణాత్మకమార్పు రాబట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషి, లక్ష్యసాధనలో మేధావి వర్గం కదలి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రూ.1,200 కోట్లతో ప్రారంభించి, రానున్న కాలంలో రూ.40 వేల కోట్లతో అమలు చేయబోతున్న సీఎం దళిత సాధికారత పథకం కోసం పటిష్ఠమైన కార్యాచరణ రూపొందిస్తున్నామన్న ఆయన.. ఆ దిశగా మేధావులు తగు సూచనలు, సలహాలు అందించాలని ఆహ్వానించారు. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను లోతుగా విశ్లేషించి.. కేటగిరీల వారిగా సమస్యలను విభజించి పథకం ద్వారా సాయం అందించే కార్యాచరణ చేపట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఎస్సీ సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం

author img

By

Published : Jun 28, 2021, 10:48 PM IST

సీఎం దళిత సాధికారత పథకాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు దళిత మేధావులు, ప్రొఫెసర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రగతిభవన్​లో పలువురు ముఖ్యమంత్రిని కలిశారు. ఎస్సీ-ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, మాదిగ విద్యావంతుల వేదిక, ఓయూ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ తదితర దళిత సంఘాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మేధావులు కేసీఆర్​ను కలిశారు. దళిత సాధికారత పథకాన్ని ప్రకటించినందుకు, మరియమ్మ లాకప్​డెత్ విషయంలో తక్షణమే స్పందించి దళితుల ఆత్మస్థైర్యాన్ని పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం ప్రవేశపెట్టిన దళిత సాధికారత పథకం.. దళితుల పాలిట వరమన్న మేధావులు.. దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక భారాన్ని లెక్కచేయకుండా చిత్తశుద్ధి, ఉదార స్వభావంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అణగారిన తమ జాతి అభివృద్ధి కోసం కంకణం కట్టుకోవడం హర్షణీయమని ఎస్సీ-ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం తెలంగాణ శాఖ నేతలు తెలిపారు. మరియమ్మ లాకప్​డెత్ అంశంలో సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి వారి కుటుంబాన్ని నిలబెట్టడంతో పాటు చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన పోలీసుల విషయంలో తీసుకున్న నిర్ణయం గొప్ప విషయమని అన్నారు. కేసీఆర్ చర్యతో దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగిందని వారు తెలిపారు.

లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలి..

మేధావులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని చక్కదిద్దుకుంటూ వస్తున్నామని వివరించారు. ప్రభుత్వ చర్యలతో అందరి జీవితాలతో పాటు దళితుల జీవితాలూ మెరుగుపడుతూ వస్తున్నాయని.. అయినప్పటికీ దళితుల కోసం ఇంకా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. సామాజికంగా, ఆర్థికంగా శతాబ్దాలుగా వివక్షకు గురవుతోన్న దళిత సమాజం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాగు చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్దిదారునికే ఆర్థిక సాయం అందించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్న సీఎం... దళిత మేధావి వర్గం, ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు అందరూ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దళిత సమాజంలో ఏం జరుగుతోంది, ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే కడు పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చో సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్యశాల నిర్వహించుకుందామని కేసీఆర్ చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల దళిత ప్రజాప్రతినిధులతో పదిన్నర గంటల పాటు చర్చ జరిగిందని... అందులో అనేక సలహాలు, సూచనలు అందించారని సీఎం తెలిపారు. వివిధ వర్గాలతో మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్... దళిత మేధావి వర్గం తమవంతు పాత్రను పోషించాలని సూచించారు.

ఇదీ చూడండి: MARIYAMMA: మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందజేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.