ETV Bharat / state

మాజీ సైనికుల సంక్షేమం కోసం ఎస్బీఐ రూ. 17 లక్షల ఆర్థిక సాయం..

author img

By

Published : Mar 16, 2022, 4:42 PM IST

SBI Donation to Ex Soldiers Welfare: మాజీ సైనికుల సంక్షేమం కోసం గత ఆరేళ్లుగా ఎస్బీఐ తన వంతు సాయం అందిస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా.. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల నుంచి విరాళాలను సేకరించింది. మొత్తంగా రూ. 17 లక్షల విలువైన చెక్కును రాజ్​భవన్​లో గవర్నర్​కు ఎస్బీఐ అధికారులు​ అందించారు.

sbi donated rs. 17 lakhs to governor
గవర్నరక్​ ఎస్బీఐ రూ. 17 లక్షల చెక్​

SBI Donation to Ex Soldiers Welfare: మాజీ సైనికుల సంక్షేమం కోసం రూ. 17 లక్షల చెక్కును గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌కు ఎస్బీఐ అధికారులు అందజేశారు. 2016 నుంచి ఏటా సాయుధ దళాల జెండా దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ.. ఆర్థిక సహయాన్ని అందిస్తోందని ఏజీఎం రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది కూడా ఉద్యోగులు, అధికారుల నుంచి సేకరించిన రూ. 17 లక్షల 12 వేల 200ను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి గవర్నర్‌ ద్వారా అందించినట్లు వివరించారు.

ఈ మొత్తాన్ని మాజీ సైనికులపై ఆధారపడిన ఆడపిల్లలు, వితంతువుల సంక్షేమానికి ఉపయోగిస్తారని ఎస్బీఐ సీజీఎం అమిత్​ జంగ్రాన్‌ తెలిపారు. మహిళల సామాజిక, ఆర్థిక స్థిరత్వం కోసం తమ బ్యాంకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

మాజీ సైనికుల సంక్షేమం కోసం రూ.17లక్షల చెక్కును అందజేసిన ఎస్బీఐ

ఇదీ చదవండి: MP Suresh Reddy Comments: '8ఏళ్లు గడిచినా విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.