రాష్ట్రంలో కరోనా నిరోధానికి జరుగుతున్న పోరాటంలో తమ వంతు భాగస్వామ్యం ఉంటుందని భారతీయ స్టేట్ బ్యాంకు హైదరాబాద్(sbi hyderabad) సర్కిల్ సీజీఎం ఓం ప్రకాష్ మిశ్రా స్పష్టం చేశారు. రెండో దశ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ (Lock down) కారణంగా రోజువారీ కూలీపై ఆధారపడి జీవనం సాగించేవారు వీధిన పడ్డారని ఆయన అన్నారు. ఆశ్రయ ఆకృతి, హెవెన్ హోం సొసైటీ, అమ్మ చేయూత ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆలాంటి 150 కుటుంబాలను గుర్తించి… వారికి భారతీయ స్టేట్ బ్యాంకు(sbi hyderabad) రేషన్ అందజేసింది.
బంజారాహిల్స్‌లో రోటరీ క్లబ్ ఛారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తున్న స్పర్ష ఆస్పత్రికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల (oxygen concentrator)ను అందించారు. ఏడు లక్షల విలువైన అయిదు లీటర్లు సామర్థ్యం కలిగిన 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల (oxygen concentrator)ను పంపిణీ చేసినట్లు ఎస్బీఐ సీజీఎం ఓం ప్రకాష్ మిశ్రా తెలిపారు.
సీఎస్‌ఆర్ సేవా కార్యక్రమాల కింద గత ఏడాది కూడా ఎనిమిది వేల పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, డిజిటల్ పల్స్ ఆక్సీమీటర్లు (Pulse Oximeter), మాస్కులు, శానిటైజర్లు… రెండు కోట్ల రూపాయలు విలువైన సామగ్రి అందించినట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: weather: రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు