కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్‌కు చెందిన రమేష్, నరేష్ ఓ ఏజెంట్ ద్వారా ఉపాధి కోసం మలేషియాకు వెళ్లారు. హోటల్లో పనిచేయాలని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి ఇద్దరు కలిసి లక్ష 20 వేల రూపాయలు చెల్లించారు. అక్కడ ఎటువంటి ఉద్యోగం లభించకపోవటం వల్ల చివరకు కూలీ పని చేయాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి తెలుగు వారి చేయూతతో స్వదేశానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.
ఇదీచూడండి: ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి!