హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద సౌదీ అరేబియా వాసులు ఆందోళనకు దిగారు. నెలరోజుల క్రితం టూర్ నిమిత్తం వచ్చిన తమను ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనిదే అనుమతించమని అధికారులు చెప్పారని వాపోయారు. సర్టిఫికెట్ కోసం గాంధీకి వస్తే... ఇక్కడి అధికారులు తమ పరిధిలోకి రాదన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో 72 గంటల్లో సౌదీ అరేబియాకు వెళ్లేందుకు విమానం ఉండగా... వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఎవర్ని సంప్రదించాలో తెలియక సౌదీ వాసులు గందరగోళానికి గురవుతున్నారు.
- ఇదీ చూడండి : భారత్లో 75కు చేరిన కరోనా కేసులు