వరంగల్ శ్రీ భద్రకాళిదేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 9 తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆహ్వానించారు. ప్రగతి భవన్లో సీఎంను కలిసిన దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఆలయ ఈఓ, అర్చకులు ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. భద్రకాళి అమ్మవారి మహోత్సవాల గోడపత్రికను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
ఇవీచూడండి: అవసరమైతే ఇంకా అప్పులు తెస్తాం: సీఎం కేసీఆర్