హైదరాబాద్లోని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సిబ్బంది శానిటైజేషన్ చేశారు. రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు పెరిగిపోతుండడం, కార్యాలయంలో ఇద్దరు సిబ్బంది మహమ్మారి బారిన పడడంతో ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయం అంతటా హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేశారు.
రాష్ట్రంలోని 5 పుర పాలికలు, రెండు కార్పొరేషన్లకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. హైదారాబాద్లోని లింగోజీగూడ మున్సిపాలిటీలో కూడా ఎలక్షన్ జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తలు, నేతలు పార్టీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉండడంతో వైరస్ వ్యాప్తి చెందకుండా శానిటైజేషన్ చేశామని సింబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి: పోలింగ్ కేంద్రం వద్ద తోపులాట.. రంగంలోకి పోలీసులు