ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో రానున్న 4 రోజులు శానిటైజేషన్: కేటీఆర్

హైదరాబాద్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మొదటి దశగా రానున్న 4 రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రదేశాల్లో బ్లీచింగ్‌ పౌడర్​ను చల్లాలని పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

ktr ghmc covid
జీహెచ్​ఎంసీ కరోనా
author img

By

Published : Apr 18, 2021, 4:07 PM IST

మంత్రి కేటీఆర్ ఆదేశాలతో గ్రేటర్​ హైదరాబాద్​లో కొవిడ్‌ వ్యాప్తికి అవకాశమున్న పలు రద్దీ ప్రదేశాల్లో డీఆర్ఎఫ్ బృందాలు బ్లీచింగ్‌ పౌడర్​ చల్లుతున్నాయి. హై రిస్క్ ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటైజేషన్, యాంటి లార్వా స్ప్రేయింగ్‌ చేస్తున్నాయి.

జనాభా అధికంగా ఉండే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్కు తదితర ప్రదేశాల్లో డీఆర్​ఎఫ్ బృందాలు స్ప్రేయింగ్​ను ప్రారంభించాయి. మొదటి దశగా రానున్న 4 రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న అన్ని రద్దీ ప్రదేశాల్లో శానిటైజేషన్ చేయాలని మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులకు తెలిపారు.

ఇదీ చదవండి: మంత్రుల పర్యవేక్షణ, ఎమ్మెల్యేలకు బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.