Sanitation in Schools: పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పారిశుద్ధ్య పనులను విధిగా ఆయా మున్సిపాలిటీ, కార్పొరేషన్లు చేపట్టాల్సిందేనని పురపాలక శాఖ మరోమారు స్పష్టం చేసింది. బుధవారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాఠశాలల్లో పారిశుద్ధ్యం అంశంపై చర్చ జరిగింది. కొత్త పురపాలక, పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలదేనని మరోమారు స్పష్టం చేశారు.
పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల పారిశుద్ధ్య పనులను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విధిగా చేపడతాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకు అనుగుణంగా పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ విషయమై పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ విధిగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల వివరాలను సేకరించాలని కమిషనర్లకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అదనంగా కార్మికులు అవసరమైతే ఆ వివరాలను పంపాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: