ETV Bharat / state

భాజపాతో కేసీఆర్​కు రహస్య ఒప్పందం ఉంది: జగ్గారెడ్డి - cm kcr

లాక్​డౌన్​ నేపథ్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్​ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్​కు భాజపాతో రహస్య ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.

sangareddy mla jaggareddy spoke on lockdown problems in telangana
భాజపాతో కేసీఆర్​కు రహస్య ఒప్పందం ఉంది: జగ్గారెడ్డి
author img

By

Published : Jun 3, 2020, 6:49 PM IST

లాక్‌డౌన్​ వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పరిశ్రమలు మూతపడడం వల్ల కార్మికులతో పాటు యాజమాన్యాలు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందిరిని ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటిపన్నును ఒక సంవత్సరం రద్దు చేయాలి లేదా మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలు ఈఎంఐ కట్టుకునే పరిస్థితుల్లో లేరని, ఆరు నెలలపాటు ప్రభుత్వమే ఈఎంఐ చెల్లించాలనే తదితర డిమాండ్లతో సీఎంకు ఉత్తరం రాస్తానని తెలిపారు. తాను లేవనెత్తిన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 9వ తేదీన తన ఇంట్లోనే ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానన్నారు. సీఎం కేసీఆర్‌ రాత్రి భాజపా, ఉదయం తెరాస అంటారని.. భాజపాతో కేసీఆర్‌కు రహస్య ఒప్పందం ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు.

ఇవీ చూడండి: సీఎం కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.