మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. తెదేపాతో ఉన్నప్పుడు తెరాసను, తెరాసలో ఉన్నప్పుడు తెదేపాపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. వ్యక్తిగత ప్రయోజనం పొందుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు, కాంగ్రెస్‌పై నోరు పారేసుకుంటే చూస్తూ... ఉరుకొమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు.
మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే.. అప్పుడు ప్రజల బాధ ఏమిటో మీకు తెలుస్తుందన్నారు. ప్రజల కోసం ఏంమైనా చేయాలనుకుంటే కేసీఆర్‌తో మాట్లాడి గాంధీ ఆస్పత్రికి రూ. మూడు వేల కోట్లు ఇప్పించి మీరేమిటో నిరూపించుకోవాలని తలసానికి జగ్గారెడ్డి సూచించారు.
ఇప్పటికిప్పుడు...సచివాలయం కూల్చడం అవసరమా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రూ.500 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి కొత్త సచివాలయం కట్టి చరిత్రలో నిలవాలన్న తాపత్రయం తప్పా.. కరోనాతో పోతున్న ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదని ఆరోపించారు.
రెండు రోజుల్లో కరోనాని ఆరోగ్య శ్రీలో చేరుస్తున్నట్లు సీఎం కేసీఆర్ జీవో తెవాలని, లేదంటే శనివారం ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. అయిన స్పందించకపోతే హైదరాబాద్ కేంద్రంగా కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్: రజకుల బతుకు దయనీయం.. జీవనం దుర్భరం