ETV Bharat / state

సంగం డెయిరీ వద్ద ఉద్రిక్తత... మీడియాను అనుమతించని పోలీసులు

సంగం డెయిరీ స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసినా.. అనిశా అధికారులు, తెనాలి సబ్​ కలెక్టర్ అక్కడకు వెళ్లడం వివాదానికి దారితీసింది. తీర్పు కాపీ రాక ముందే డేటా సర్వర్లు తీసుకెళ్లేందుకే యత్నిస్తున్నారంటూ ఉద్యోగులు నిరసనకు వ్యక్తం చేశారు.

sangam dairy
sangam dairy
author img

By

Published : May 7, 2021, 7:45 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డెయిరీ స్వాధీనానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఆరాష్ట్ర హైకోర్టు కొట్టివేసినా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు, తెనాలి సబ్ కలెక్టర్ అక్కడకు వెళ్లారు. సంస్థకు సంబంధించిన డేటా సర్వర్లను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారని అక్కడి సిబ్బంది తెలిపారు. పోలీసు బలగాలతో వచ్చి ప్రధాన కార్యాలయం వద్ద వారిని మోహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓవైపు ప్రభుత్వ జీవోను హైకోర్టు కొట్టివేస్తే.. సబ్ కలెక్టర్, పోలీసులు ఎలా వస్తారని సంస్థ సిబ్బంది ప్రశ్నించారు. కోర్టు తీర్పు కాపీ రాకముందే.. కీలక డేటాను ఇక్కడి నుంచి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరుని నిరసిస్తూ డెయిరీ వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

మీడియాపై ఆంక్షలు...

ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం సంగం డెయిరీ తమ ఆధ్వర్యంలో ఉందని.. తనిఖీలు జరుగుతున్న కారణంగా మీడియాకు అనుమతి లేదని బయటకు పంపించారు. ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తామని సౌత్ జోన్ డీఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది చెప్పారు. మీడియాను బయటకు పంపించడంపై డెయిరీ సిబ్బంది మండిపడుతున్నారు.

సంగం డెయిరీ వద్ద ఉద్రిక్తత

ఇదీ చూడండి: సంగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.