Sandeep Shandilya Appointed as Hyderabad CP : హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యను (Sandeep Shandilya) నియమించారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఎవరు వస్తారన్న అంశానికి తెరపడింది. తెలంగాణ పోలీసు అకాడమీ సంచాలకులుగా పని చేస్తున్న సందీప్ శాండిల్య, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, కొత్తకోట శ్రీనివాస రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినా.. ఎన్నికల సంఘం సందీప్ శాండిల్యవైపు మొగ్గు చూపింది. అందుకనుగుణంగా ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకుంటామని సందీప్ శాండిల్య తెలిపారు. తమ సిబ్బందితో మాట్లాడి హైదరాబాద్ పరిస్థితిపై సమీక్షిస్తానని ఆయన పేర్కొన్నారు.
Transfer Orders Issued IAS and IPS Officers in Telangana : తాజాగా తెలంగాణలో ఎన్నికల నిర్వహణ వేళ వేటు పడిన అధికారుల స్థానంలో ఎన్నికల సంఘం(Election Commission) ఆదేశాలకు అనుగుణంగా.. అధికారుల బదిలీకి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం పంపిన ప్యానెల్ నుంచి అధికారులను ఎంపిక చేసిన ఈసీ.. అందుకు సంబంధించిన జాబితాను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. కొత్తగా నియమితులైన అధికారులు శుక్రవారం సాయంత్రంలోగా బాధ్యతలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
Telangana Assembly Elections 2023 Transfers to Officers : ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించారు. యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆసీసీ సగ్వాన్‌ను.. రంగారెడ్డి కలెర్టర్‌గా భారతీ హోలీకేరీ, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతంను నియమించారు,
Transfer Orders Issued IPS Officers in Telangana : భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ఖారే, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్,.. సూర్యాపేట ఎస్పీగా రాహూల్ హెగ్డే, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రం సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్ గౌతం,.. వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేశ్, మహబూబ్‌నగర్ ఎస్పీగా హర్షవర్థన్, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితీరాజ్‌ను నియమించారు. బదిలీ అయిన వాళ్లు ఈ రోజు సాయంత్రం లోపు బాధ్యతలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి (Shanti Kumari) ఆదేశించారు. ఐపీఎస్‌ల బదిలీతో ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొన్ని ఖాళీ అయ్యాయి. ఆయా స్థానాలను సమీపంలో ఉన్న డీసీపీలకు కేటాయించారు. త్వరలో బదిలీ అయిన స్థానాలకు కొత్త ఐపీఎస్‌లను కేటాయించనున్నారు.
Telangana CS Sent New IPS List to EC : ఈసీ బదిలీ చేసిన పోస్టులకు ప్యానెల్ పంపిన రాష్ట్ర ప్రభుత్వం
Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!