ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(World Environmental Day) పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి.. దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు సైకత శిల్పాన్ని రూపొందించారు. చెట్లను కాపాడాలనే నినాదంతో.. కరోనా నుంచి భద్రతకావాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే సందేశాన్నిస్తూ దానిని తీర్చిదిద్దారు.
చెట్లను రక్షిస్తే.. పర్యావరణాన్ని రక్షించినట్టేనంటూ సందేశాన్నిస్తూ రెండు చేతులతో చెట్టును, భూమిని ఒడిసి పట్టుకొని కాపాడుతున్నట్టుగా సైకత శిల్పాన్ని(sand art) రూపొందించారు. అందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: పుడమికి పునరుజ్జీవం జీవజాలానికి అభయం