ETV Bharat / state

తాడి వంశీయుల ఆత్మీయ కలయిక.. హాజరైన 400 మంది - Get Together

Same Clan Get Together: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులో తాడి వంశీయుల ఆత్మీయ కలయికను నిర్వహించారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన ఒకే ఇంటిపేరు గల 70 కుటుంబాలకు చెందిన సుమారు 400 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 12 తరాల తాడి వంశీయుల వంశవృక్షం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Same Clan Get Together
Same Clan Get Together
author img

By

Published : Jan 18, 2023, 2:43 PM IST

East Godavari Same Clan Get Together: ఒకే ఇంటి పేరుతో ఉన్న వారందరూ ఒక చోట కలిస్తే బాగుంటుందని మనలో చాలా మందికి కలిగే ఆలోచన. అలా కలుసుకొని అందరితో పరిచయం పెంచుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంటుంది. ఇలాంటి ఆలోచనే ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో తాడి వంశీయులకు వచ్చింది. అనుకున్న వెంటనే ఏర్పాట్లు చేశారు. దేశ విదేశాల్లో ఉన్న తాడి వంశీయులను ఆహ్వానించారు. సంక్రాంతి పండుగ ఇందుకు వేదికైంది. సుమారు 70 కుటుంబాలకు చెందిన 400 మంది ఇలా కలుసుకుని ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో ఒకే ఊరిలో ఉన్నవారినే కలవడానికి సమయం దొరకని పరిస్థితి. కానీ దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం తమ వంశీయులను కలుసుకునేందుకు ఇక్కడికి రావడం విశేషం.తూర్పు గోదావరి జిల్లా జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలోని తాడి వంశీయులు ఒకే చోట కలిశారు. సుమారు 70 కుటుంబాలకు చెందిన 400 మంది ఒకే చోట కలుసుకుని ఆనందంగా గడిపారు.

వారి వంశంలో వారికి తెలిసిన వారి పలకరింపులు.. తెలియని వారిని పరిచయం చేసుకుని వారు కలిసిన చోట సంతోషంలో మునిగి తేలారు. ఇందులో వారి వంశానికి చెందిన 12 తరాల వంశవృక్షాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి పిల్లలకు వారి గురించి వివరించుకుంటు తల్లిదండ్రులు, పెద్దలు మురిసిపోయారు.

వారంతా ఒక చోట కలుసుకుని పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించుకున్నారు. ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నం కేవలం పిల్లలకే అయితే ఎలా అనుకున్నారేమో.. పెద్దలకూ ఆటల పోటీలు నిర్వహించుకుని విజేతలకు బహుమతులు అందించుకున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటుకు కృషి చేసిన కుటుంబ సభ్యులను సత్కరించుకున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.