ETV Bharat / state

ఆకలి తీర్చిన వారికి సమరిటన్​ అవార్డులతో సత్కారం - రాచకొండలో సమరిటన్​ అవార్డుల పురస్కారం

లాక్​డౌన్​లో రాచకొండ పోలీస్​శాఖతో కలిసి... ఎంతో మంది ఆకలి తీర్చిన వారిని కమిషనర్​ మహేశ్​ భగవత్​ సమరిటన్​ అవార్డులతో సత్కరించారు. విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి... తమకు తోచిన సహాయం చేసినందుకు వారందరిని మహేశ్​ భగవత్​ ప్రశంసించారు.

Felicitation to Good Samaritans of Rachakonda
ఆకలి తీర్చిన వారికి సమరిటన్​ అవార్డులతో సత్కారం
author img

By

Published : May 30, 2020, 5:21 PM IST

కొవిడ్ మహమ్మారి కారణంగా గత రెండున్నర నెలల లాక్​డౌన్​ కాలంలో చాలా మంది రాచకొండ పోలీస్​ కమిషనరేట్​తో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారని సీపీ మహేశ్​ భగవత్ తెలిపారు. సాయం చేసిన వ్యక్తులను, సంస్థలను సమరిటన్​ అవార్డులతో సత్కరించారు. నిరుపేదలను ఆదుకుని పోలీసుల ఆరోగ్యం కోసం తమకు మాస్కులు, పీపీఈ కిట్లు అందజేసిన వారి ఔదార్యాన్ని సీపీ ప్రశంసించారు.

ముఖానికి మాస్కలు ధరించి.. తరచూ చేతులు కడుక్కోవడం ద్వారా కొవిడ్​ను నియంత్రించవచ్చని సీపీ తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ వైరస్ వ్యాప్తి నుంచి తమను తాము రక్షించుకోవాలని కోరారు. సమాజానికి తమకు తోచిన సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర పోలీసుశాఖకు దాతలు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: 'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.