కరోనా కారణంగా ప్రపంచంలోని ప్రజలందరు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని.. వారికి మానసిక ప్రశాంతతను అందించేందుకు సహజ యోగ ధ్యాన కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు సహజ యోగ ధ్యానం తెలంగాణ ట్రస్ట్ పెర్కొంది. గురువు నిర్మల దేవి ఆధ్వర్యంలో ఆన్‌లైన్ ద్వారా జనవరి 3 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా .. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ట్రస్ట్ ప్రతినిధులు ఆవిష్కరించారు.
క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసుకొని
ప్రపంచ వ్యాప్తంగా .. 12 గంటల పాటు 16 భాషల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహజ యోగ ధ్యానం తెలుగులో రేపు 11.15 నిమిషాల నుంచి 12 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. సహజయోగ ధ్యానం క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసుకొని ఆన్‌లైన్ ద్వారా అందరు పాల్గొని మానసిక ప్రశాంతను పొందాలన్నారు. www.sahajayogtelangana.org/live, లేదా www.sahajaygoaandhra.org/live ద్వారా లాగ్‌ఆన్ కావాలని సూచించారు.
10 కోట్ల మంది లక్ష్యంగా..
గత ఏడాది నిర్వహించిన కార్యక్రమంలో 10 లక్షల మంది పాల్గొన్నారని.. ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా దాదాపు 10 కోట్ల మందికి సహజయోగను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించినట్లు సహజ యోగ ధ్యానం తెలంగాణ ట్రస్ట్ సభ్యుడు వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:'నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడం సంతోషంగా ఉంది'