ETV Bharat / state

Sadguru on green india challenge: 'తెలంగాణ బిగ్ గ్రీన్‌స్పాట్‌గా మారింది' - గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Sadguru on green india challenge: తెలంగాణలో హరితహారం కార్యక్రమం ఆశ్చర్యం కలిగిస్తోందని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్​ చూస్తుంటే అంతా పచ్చదనం పరిచినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని అటవీ పార్క్‌లో ఎంపీ సంతోశ్ కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదో విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Sadguru vasudev
Sadguru on green india challenge
author img

By

Published : Jun 16, 2022, 4:53 PM IST

Updated : Jun 16, 2022, 8:58 PM IST

Sadguru on green india challenge: ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్ చాలా గొప్పగా ఉందని సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసించారు. హరితహారం ఒక ప్రజా ఉద్యమమని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకొని మొక్కలు నాటడం అభినందనీయం సద్గురు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని అటవీ పార్క్‌లో ఎంపీ సంతోశ్ కుమార్​ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

హైదరాబాద్ అంతా పచ్చగా కనిపిస్తోంది. హరితహారం. ఇదొక ప్రజాఉద్యమం.ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్‌ఛాలెంజ్ గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకొని మొక్కలు నాటడం అభినందనీయం. సానుకూల దృక్పథం.. పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. భూగోళంపై పంటలు, పశుగ్రాసం, పొదలు, వృక్షాలు ఉంటేనే పచ్చదనం. ఆక్సిజన్ కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నాం. - సద్గురు జగ్గీ వాసుదేవ్

హైదరాబాద్ నగరమంతా పచ్చగా కనిపిస్తోందని సద్గురు జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. ప్రజలు సానుకూల దృక్పథం, పోటీతత్వంతో ముందుకు వెళ్లాలని సద్గురు సూచించారు. భూగోళంపై పంటలు, పశుగ్రాసం, పొదలు, వృక్షాలు ఉంటేనే పచ్చదనం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ బిగ్ గ్రీన్ స్పాట్​గా మారడం సంతోషంగా ఉందని సద్గురు జగ్గీ వాసుదేవ్ తెలిపారు. 'సేవ్​ సాయిల్​' పేరిట ప్రపంచ వ్యాప్తంగా సద్గురు అవగాహన కల్పిస్తున్నారు.

ఇవీ చదవండి: REVANTH REDDY TWEET: 'ట్విటర్‌ పిట్ట ఇచ్చిన హామీకి ఇప్పటికీ అతీగతీ లేదు'

బంగారానికి దారి చూపిన ఎలుక.. ఆ ఫ్యామిలీ ఫుల్​ ఖుష్!

Last Updated : Jun 16, 2022, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.