రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28న సదర్ వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలకు రాజధాని ముస్తాబవుతోంది. నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకల్లో మేలు రకం జాతి దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన కిరణ్‌యాదవ్ హరియాణాకు చెందిన శక్తి దున్నను హకీంపేటలో పోషిస్తున్నారు. రూ.10లక్షలకు కొనుగోలు చేసిన దున్నరాజు ఇప్పడు రూ.10 కోట్లకు పైగా ధర పలుకుతోందని నిర్వాహకుడు తెలిపారు. ఎల్లారెడ్డిగూడ సదర్ వేడుకల్లో శక్తి దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం10 లీటర్లు, సాయంత్రం 10 లీటర్ల పాలతో పాటు... రోజుకు రూ.10 వేలు ఖర్చు అవుతోందని ఆయన వివరించారు.
ఇదీ చదవండిః సదర్ సమ్మేళనంలో అలరించనున్న సర్తాజ్, రుస్తుం