వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చిట్టంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి దేహాలను ట్రాక్టర్లో ఆసుపత్రికి తరలించడం పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లో తరలించాలని అధికారులను అదేశించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి మర్పల్లి ఆసుపత్రికి వచ్చిన ఆమె.. మృతుల కుటుంబాలను పరామర్శించారు.
మృతుల కుటుంబాల ఆర్థిక స్థితిగతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి.. కుటుంబానికి రూ.50 వేలు, ఎమ్మెల్యే ఆనంద్ రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహయం అందించారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని పథకాలను అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తిరిగి రోడ్డు ప్రమాదాలు జరగకుండా సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు.
ఇదీ చూడండి: తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు