ETV Bharat / state

రైతుబంధు: ఆరో రోజు అన్నదాతల ఖాతాల్లోకి ఎన్నికోట్లంటే? - తెలంగాణ రైతుబంధు ఆరో రోజు వివరాలు

Rythubandhu 6th day: రైతుబంధు పథకం పదో విడత నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్​ 27న రైతుల ఖాతాలో జమ చేయడం మెుదలు పెట్టింది.వ్యవసాయ రంగం బలోపేతం కాడానికి, రైతులు ఆర్థికంగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. నేడు ఆరో రోజు రైతుబంధు నిధులను రూ.262.60 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.

Rythubandhu 6th day
రైతుబంధు ఆరో రోజు నిధులు
author img

By

Published : Jan 3, 2023, 4:53 PM IST

Updated : Jan 3, 2023, 5:05 PM IST

Rythubandhu 6th day: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీ కొనసాగుతోంది. 6వ రోజు రైతుబంధు కింద రూ.262.60 కోట్లు విడుదలయ్యాయి. మంగళవారం 1,49,970 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆ నిధులు జమయ్యాయి. 5 లక్షల 25 వేల 200.21 ఎకరాల విస్తీర్ణం భూములకు నిధులు విడుదల అయ్యాయి. ఇప్పటి వరకు 51 లక్షల 50,958 మంది రైతులకు 3767.35 కోట్లు నిధులు రైతుబంధు పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు రైతు ఖాతాలో జమ చేసిన డబ్బుల వివరాలు:

రోజువిడుదల చేసిన నిధులు(రూ.కోట్లలో)
మెుదటి రోజురూ.607.32
రెండో రోజురూ.1218
మూడో రోజురూ.687.89
నాలుగో రోజురూ.575
ఐదో రోజు265.18
ఆరో రోజురూ.262.60

దేశంలో 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాలని ఎనిమిదేళ్లలో కేసీఆర్ వినూత్న పథకాలతో పటిష్టం చేశారని తెలిపారు. దేశమంతా ఈ పథకాలు అమలైతే దేశ వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 3, 2023, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.