ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు సాయం అందనుంది. గత యాసంగిలో 59.33 లక్షల మందికి రైతుబంధు పథకం సొమ్ము అందింది. కొత్తగా 2.22 లక్షల మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఫలితంగా ఈ సీజన్‌లో సొమ్ము అందుకునేవారి సంఖ్య 61.55 లక్షలుంటుందని ప్రాథమిక అంచనా.
ఈ నెల 10 వరకూ భూములను కొన్న రైతులను పథకంలో నమోదు చేయాల్సి ఉంది. ఈ నెల 10 వరకూ మొత్తం 2.22 లక్షల మంది రైతులను పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ ఖాతాల్లోకి మార్చినట్లు రెవెన్యూశాఖ వెల్లడించింది. వీరి పేర్లకు ఎదురుగా బ్యాంకు పొదుపు ఖాతా సంఖ్య, బ్యాంకు పేరు, దాని ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను ఏఈఓలే గ్రామస్థాయిలో పరిశీలించి రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాలి. తమ పేర్లను నమోదు చేయాలంటూ అధికారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.
YADADRI: స్వర్ణ వర్ణ శోభితమయం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయం