'బ్లూ ఫ్లాగ్ బీచ్'గా రుషికొండ బీచ్ అరుదైన ఘనత సాధించింది. బ్లూ ఫ్లాగ్ స్టాండర్డ్స్‌ను అమలు చేస్తున్న 8 సముద్రతీరాల వివరాలను అంతర్జాతీయ జ్యూరీకి అందించారు. మూడేళ్లుగా ఈ బీచ్‌లలో చేసిన అభివృద్ధి పనులను అందులో వివరించారు. వాటిలో రుషికొండ బీచ్ ఒకటిగా ఉంది. పరిశుభ్ర బీచ్‌గా రుషికొండ సాధించిన ఘనత పర్యటకానికి మేలు చేయనుంది.
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దక్కించుకోవడం సంతోషంగా ఉందని ఏపీ టూరిజం సీఈఓ ప్రవీణ్ కుమార్ అన్నారు. విశాఖతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని చెప్పారు. దీంతో పర్యాటకాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయన్నారు. రుషికొండ బీచ్‌ను ఇంకా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని... 7 నక్షత్రాల హోటల్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: అమితాబ్‌కు చిరు విషెస్.. 'ప్రతిభకు పవర్‌హౌస్' అని ట్వీట్