ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 25వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మెకు వెళతామని అయన హెచ్చరించారు. ఈ మేరకు బస్‌భవన్‌లోని ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసులు అందచేశారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పటికే టీజేఎంయూ, ఇయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ యూనియన్లు నోటీసులు అందజేశాయి. ఈ సమస్య జటిలం కాకుండా యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అశ్వద్ధామ పేర్కొన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్ర ప్రభుత్వంపై ఇక ప్రజాపోరాటమే..!