జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ కారణంగా ప్రయాణాలు రద్దు కావడం వల్ల... ఈ ఏడాది మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ముందస్తుగా కొనుగోలు చేసిన టికెట్లకు సంబంధించిన నగదును నేటి నుంచి వెనక్కి ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్నవారికి గతంలోనే ఆ డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశారు. మిగిలినవారు 29వ తేదీలోగా రిజర్వేషన్ కౌంటర్లు, ఏటీబీ కేంద్రాలకు టికెట్లను తీసుకెళ్లి డబ్బులు పొందవచ్చని ఏపీఎస్ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) కేఎస్ బ్రహ్మానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ