ETV Bharat / state

వజ్ర బస్సులు అమ్మడానికి సిద్ధమైన ఆర్టీసీ - ఆర్టీసీలో నష్టంపై మేథోమథనం..

ఆర్టీసీలో నష్టంపై ఆ సంస్థ అధికారులు మేథోమథనం చేస్తున్నారు. నష్టాలు తగ్గించుకునే పనిలో పడ్డారు. డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిప్పులను తగ్గించి.. ఎక్కువగా ఉన్న మార్గాల్లో బస్సులను పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే లాభాలు లేని డిపోలకు బాధ్యులను నియమించారు. ఇప్పుడు నష్టాలు తీసుకొస్తున్న వజ్ర బస్సులను అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి.

RTC ready to sale vajra mini busess in telangana
వజ్ర బస్సులు అమ్మడానికి సిద్ధమైన ఆర్టీసీ
author img

By

Published : Jan 13, 2020, 5:46 AM IST

Updated : Jan 13, 2020, 7:37 AM IST

వజ్ర బస్సులు అమ్మడానికి సిద్ధమైన ఆర్టీసీ

ఆర్టీసీలో డిపోల వారీగా నష్టాలు వస్తున్న మార్గాలపై ఆ సంస్థ అధికారులు మేథోమథనం చేస్తున్నారు. ఏ ట్రిప్పుల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు..? ఏ ట్రిప్పుల్లో తక్కువగా ఉంటున్నారు...? తదితర అంశాలపై అధికారులు డిపోల వారీగా అధ్యయనం చేస్తున్నారు. డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లో సర్వీసులను హేతుబద్దీకరణ చేసేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు.

లాభాల్లో 11 డిపోలు

ఒకే సమయంలో రెండేసి బస్సులకంటే ఎక్కువ తిరిగితే వాటి సంఖ్య తగ్గించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిప్పులు తగ్గించి.. ఎక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిప్పులను పెంచాలని చూస్తున్నారు. 97 ఆర్టీసీ డిపోల్లో 11 డిపోలు మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. మిగతా వాటి లాభాల్లోకి తీసుకొచ్చేందుకు 86 డిపోలకు ప్రత్యేక అధికారులను ఆర్టీసీ నియమించింది.

వజ్రతో నష్టమే

మరోపక్క వజ్ర బస్సులను అమ్మేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఆ దిశగా ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. ప్రయాణికులను ఇంటి నుంచే ఎక్కించుకునే ఆలోచనతో మూడేళ్ల కిందట 66 వజ్ర మినీ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు సుమారు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. వీటితో అయ్యే ఖర్చుకు.. ఆదాయానికి పొంతన లేకపోవడం వల్ల అవి ఆర్టీసీకి భారంగా మారాయి.

నష్టం వస్తే అమ్మేయండి

నష్టాలు వస్తున్న బస్సులను తొలగించాలని సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. లాభాలు రావు అనుకుంటే వజ్ర బస్సులను తీసేయండి అని సీఎం నుంచి అనుమతి లభించడం వల్ల ఆ దిశగా అధికారులు ఆలోచన చేస్తున్నారు. బస్సులను కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి కండిషన్​లో ఉన్నాయో.. అలాంటి కండిషన్​లో ఉంచాలని వజ్ర బస్సుల డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. వాటికి మరమ్మతులు చేస్తున్నారు. వజ్ర బస్సుల అమ్మకాలు సంక్రాంతి తర్వాత చేస్తారా.. లేదంటే మేడారం జాతర తర్వాత చేస్తారా.. అనేది తేలలేదని డిపోమేనేజర్లు పేర్కొంటున్నారు.

ఇవీ చూడండి: విజయమే ధ్యేయంగా తెరాస వ్యూహాలు

TG_HYD_02_13_VAZRA_BUSES_FOR_SALE_AV_3182388 reporter : sripathi.srinivas ( ) ఆర్టీసీలో డిపోల వారీగా నష్టాలు వస్తున్న మార్గాలపై అధికారులు మేథోమథనం చేస్తున్నారు. ఏ ట్రిప్పుల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు..? ఏ ట్రిప్పుల్లో తక్కువగా ఉంటున్నారు...? తదితర అంశాలపై అధికారులు డిపోల వారీగా అధ్యయనం చేస్తున్నారు. డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లో సర్వీసులను హేతుబద్దీకరణ చేసేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఒకే సమయంలో రెండేసి బస్సులకంటే ఎక్కువ తిరిగితే వాటి సంఖ్య తగ్గించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. డిమాండ్ తక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిప్పులను తగ్గించి..ఎక్కువగా ఉన్న మార్గాల్లో ట్రిప్పులను పెంచాలని చూస్తున్నారు. నష్టాలను తగ్గించి లాభాలు తీసుకొచ్చేందుకు 86 డిపోలకు ప్రత్యేక అధికారులను ఆర్టీసీ నియమించింది. 97 ఆర్టీసీ డిపోల్లో 11 డిపోలు మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. అవి మినహా మిగితా డిపోలకు బాధ్యులను నియమించారు. మరోపక్క వజ్ర బస్సులను అమ్మేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. ఆదిశగా ఉన్నతాధికారుల నుంచి డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. ప్రయాణికులను ఇంటి నుంచే ఎక్కించుకునే ఆలోచనతో మూడేళ్ల కిందట 66 వజ్రా మినీ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఒక్కో బస్సు సుమారు మూడు లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. వీటితో అయ్యే ఖర్చుకు..ఆదాయానికి పొంతన లేకపోవడంతో అవి ఆర్టీసీకి భారంగా మారాయి. నష్టాలు వస్తున్న బస్సులను తొలగించాలని సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. లాభాలు రావు అనుకుంటే వజ్ర బస్సులను తీసేయండి అని సీఎం నుంచి అనుమతి లభించడంతో ఆదిశగా అధికారులు ఆలోచన చేస్తున్నారు. వజ్ర బస్సులను మూకుమ్మడిగా విక్రయించాలని ఓ నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. ఐతే..బస్సులను కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి కండిషన్ లో ఉన్నాయో..అలాంటి కండీషన్ లో ఉంచాలని వజ్ర బస్సుల డిపో మేనేజర్లకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. దీంతో వాటికి మరమ్మత్తులు చేస్తున్నారు. మొదటి విడతలో 80శాతం బస్సులను, ఎక్కువగా మరమ్మత్తులు ఉన్న బస్సులను రెండో దశలో విక్రయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అది సంక్రాంతి తర్వాత చేస్తారా..లేదంటే మేడారం జాతర తర్వాత చేస్తారా..అనేది తేలలేదని వజ్ర బస్సులు నడిచే డిపోమేనేజర్లు పేర్కొంటున్నారు.
Last Updated : Jan 13, 2020, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.