ETV Bharat / state

విజయమే ధ్యేయంగా తెరాస వ్యూహాలు - municipal corporation elections in telangana

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా తెరాస పావులు కదుపుతోంది. కార్పోరేషన్ల పరిధిలోని మంత్రులు ఎమ్మెల్యేలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. గతంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్​కు ప్రత్యేక నిధులు ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లలో భాజపా, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలకు వివరించాలని కేటీఆర్​ సూచించారు.

trs focus on corporations in telanagana
విజయమే ధ్యేయంగా తెరాస వ్యూహాలు
author img

By

Published : Jan 13, 2020, 4:42 AM IST

విజయమే ధ్యేయంగా తెరాస వ్యూహాలు

కార్పొరేషన్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెరాస ముందుకు వెళ్తోంది. శనివారం మున్సిపాలీటీల్లోని నాయకులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఆదివారం ​కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. 10 కార్పొరేషన్లలో విజయం సాధించాల్సిందేనని కేటీఆర్​ వారికి తేల్చిచెప్పారు. భౌగోళికంగా పెద్దవైన పురపాలికల్లో పార్టీ విజయం సాధించాల్సిందేనన్నారు. ఈ సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలాకర్, ఎమ్మెల్యే గణేశ్​ బిగాలా, కోరుకంటి చందర్, పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ

మున్సిపాలిటీలతో పోల్చితే, కార్పొరేషన్లలో తెరాస తరఫున పెద్ద ఎత్తున నామినేషన్ల వేసిన నేపథ్యంలో ఇక్కడ బీ ఫారాలు దక్కే అభ్యర్థులు తప్ప ఏవరూ పోటీలో లేకుండా చూడాలన్నారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బడంగ్​పేట్, మీర్​పేట్, బండ్లగూడా జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదీగూడా, జవహార్​నగర్, నిజాంపేట్ కార్పొరేషన్లలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. స్వయంగా ఆయా కార్పోరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్​ మాట్లాడారు.

ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గతంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కార్పొరేషన్లకు ప్రత్యేకంగా బడ్జెట్​లో నిధులిచ్చిన విషయాన్ని ప్రచారంలో ప్రస్తావించాలని సూచించారు. ఈ దఫా నూతనంగా ఏర్పాటైన కార్పొరేషన్ల అభివృద్ధికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్న హమీ ఇవ్వాలన్నారు.

కరీంనగర్, నిజామాబాద్​లో

రామగుండం ఎన్నికల్లో విజయం సాధించేందుకు మంత్రి కొప్పుల సహాకారం తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​కు సూచించారు. కరీంనగర్, నిజామాబాద్​లో భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయి, లోపాయికారీగా కలిసి పనిచేస్తున్న తీరును ప్రజల ముందు పెట్టాలన్నారు. రెండు పార్టీలు తెరాసను సొంతగా ఎదుర్కోలేకపోతున్నాయన్నారు.

ఇదీ చదవండి: విజిలెన్స్​ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్

TG_Hyd_57_12_TRS_Focus_On_Corporations_Pkg_3064645 Reporter: Nageswara Chary Script: Razaq Note: ఫీడ్ తెలంగాణ భవన్ OFC నుంచి వచ్చింది ( ) మున్సిపల్ కార్పోరేషన్లలో విజయంపైన తెరాస ఫోకస్ పెట్టింది. అన్ని కార్పోరేషన్‌లలో విజయం సాధించాల్సిందేనని వాటి పరిధుల్లోని మంత్రులు ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖరాఖండిగా చెప్పారు. కార్పోరేషన్ల పరిధిలోని మంత్రులు ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. గతంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాలకు ప్రత్యేక నిధులు ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీల లోపాయికారి కుమ్మక్కుని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. కార్పోరేషన్‌లలో పార్టీ బీ ఫారాలకు భారీ పోటీ నేపథ్యంల నామినేషనల ఉపసంహరణపైన దృష్టి పెట్టాలని కేటీఆర్ ఆదేశించారు.....Loook V O : పురపాలక ఎన్నికల్లో ఘన విజయం కోసం ప్రయత్నం చేస్తున్న టిఆర్‌ఎస్ పార్టీ, కీలకమైన కార్పోరేషన్లలో భారీ విజయం కోసం కసరత్తు చేస్తుంది. నిన్న మున్సిపాలీటీల్లోని నాయకులు, ఎమ్మెల్యేలతో సమావేశమైన ఆ పార్టీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఈ రోజు కార్పోరేషన్లలోని మంత్రులు, నాయకులతో చర్చించారు. రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతున్న 10 కార్పోరేషన్లన్నింటిలో విజయం సాధించాలని ఈ సదర్భంగా వారికి కేటియార్ తెల్చిచెప్పారు. ఈ ఎన్నికల్లో కార్పోరేషన్లు చాల కీలకమైనవని, భౌగోళికంగా పెద్దవైన ఈ పురపాలికల్లో పార్టీ విజయం సాధించాల్సిందేనన్నారు. ఇక్కడ విజయం కోసం పూర్తి స్ధాయి ప్రయత్నాలు చేయాలని, ఇందులో ఏలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. మున్సిపాలిటీలతో పోల్చితే, కార్పోరేషన్లతో టియారెస్ పార్టీ తరపున పెద్దఎత్తున నామినేషన్ల వేసిన నేపథ్యంలో ఇక్కడ బిఫారాలు దక్కే అభ్యర్ధులు మినహా ఇంకా ఏవరూ పోటీలో లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతున్న కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బడంగ్ పేట్, మీర్ పేట్, బండ్లగూడా జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదీగూడా, జవహార్ నగర్, నిజాంపేట్ కార్పోరేషన్లలోని క్షేత్రస్థాయి పరిస్ధితులపైన చర్చించారు. స్వయంగా అయా కార్పోరేషన్ల పరిధిలోని మంత్రులు, యంఏల్యేలతో కెటియార్ మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ ఉన్న నామినేషన్లు వేసిన అభ్యర్ధుల సంఖ్యతోపాటు నగరాల్లో ప్రచారం జరుగుతున్న తీరుపైన చర్చించారు. పార్టీ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను పెద్ద ఏత్తున ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. గతంలో వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి కార్పోరేషన్లకు ప్రత్యేకంగా బడ్జెట్ లో నిధులిచ్చి అయా నగరాల అభివృద్ది కృషి చేస్తున్న తీరుని తమ ప్రచారంలో ప్రస్తావించాలని సూచించారు. ఈ దఫా నూతనంగా ఏర్పాటైన కార్పోరేషన్ల అభివృద్దికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్న హమీ ఇవ్వాలని కోరారు. end Vo: ఈ సమావేశంలో మంత్రులు మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమాలాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ బిగాలా, కోరుకంటి చందర్ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ శేరి సుభాష్ రెడ్డిలతో కార్పోరేషన్లపైన సమీక్షించారు. ఈరోజు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ శేరి సుభాష్ రెడ్డిలతో కార్పోరేషన్లపైన సమీక్ష నిర్వహించారు. రామగుండం స్ధానిక యంఏల్యే కోరుకంటి చందర్, మంత్రి కొప్పల ఈశ్వర్ తో కెటియార్ సమావేశం అయ్యారు. కార్పోరేషన్ ఎన్నికలో విజయం సాధించేందుకు మంత్రి కొప్పుల సహాకారం తీసుకోవాలని యంఏల్యేకు సూచించారు. స్ధానికంగా ఉన్న నాయకులతోపాటు రామగుండం నగరంలోని నాయకులతో మంత్రి కొప్పులకున్న సంబంధాలు ఈ ఎన్నికలల్లో విజయానికి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. హైదరాబాద్ శివారులోని కార్పోరేషన్లపైన పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినందున వాటిలో విజయం పార్టీకి చాల కీలకమని మంత్రి మల్లారెడ్డికి తెలిపారు. ఈ మేరకు వాటిలో ఉన్న పార్టీ స్ధితిగతులు, కార్యచరణపైన చర్చించారు. శివార్లలో పురపాలికలను ఏర్పాటు చేయకముందు ప్రజలకు ఎదురైన ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకుపోవాలని కోరారు. కార్పోరేషన్ల ఏర్పాటు ద్వార వచ్చే మౌళిక వసతులు, అభివృద్ది కార్యక్రమాల ద్వారా కలిగే ప్రయోజనాలను సైతం తెలియజేయాలన్నారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్ల ఎన్నికలపైన కూడా ఈ సందర్భంగా కెటియార్ చర్చించారు. ఈ రెండు కార్పోరేషన్లతో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయి, లోపాయికారీగా కలిసి పనిచేస్తున్న తీరును ప్రజల ముందుపెట్టాలన్నారు. ఈరెండు పార్టీలు టియారెస్ ను సొంతగా ఎదుర్కోలేకపోతున్నాయని, ఇదే టియారెస్ పార్టీకున్న బలాన్ని సూచిస్తుందన్న కెటియార్, ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీల అనైతిక తీరుని ఎత్తి చూపాలన్నారు. ఈ మేరకు యంఏల్యే గణేష్ బిగాలతో మాట్లాడారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.