నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌ను.. ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. ఈనెల 5న రాత్రి సమయంలో సికింద్రాబాద్ వైపునకు వెళ్తున్న సిటీ బస్సులో ఘనపూర్ వద్ద ఓ ప్రయాణికుడు బాసిరెడ్డి రాజు ఎక్కారు. జేబీఎస్లో అతడు దిగి వెళ్లిపోయారు. అనంతరం కండక్టర్ సాంగని శ్రీనివాస్.. బస్సులో ఓ పర్సును గుర్తించారు. అందులో రూ.49,500 నగదు ఉంది. సిద్దిపేటకు వచ్చిన తర్వాత కండక్టర్, డ్రైవర్ కలిసి ఆ పర్సును డిపో మేనేజర్ రామ్ మోహన్‌రెడ్డికి ఆ పర్సును అందించారు. అనంతరం ఆ పర్సును బాధితుడు బాసిరెడ్డికి ఆర్టీసీ సిబ్బంది అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ .. కండక్టర్ సాంగని శ్రీనివాస్‌పై ప్రశంసలు కురిపించారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదంపైనా..
పెద్దపల్లి జిల్లా మంథని ప్రమాద ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంగా వాహనం నడపడం వల్లనే ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిందని.. అందువల్లనే బస్సు లోయలో పడిందని ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పండుగ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం, బాధాకరమన్నారు.. ఆర్టీసీ ఎండీ. బస్సు డ్రైవర్ చాకచక్యం వల్లనే ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలిగామన్నారు.
ఇదీచూడండి: కారును ఢీకొని లోయలో పడిన బస్సు... ఒకరు మృతి... 13 మందికి గాయాలు