RTC MD Sajjanar responds on Pallevelugu Bus Accident : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో చక్రాలు ఊడిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాద ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) స్పందించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఇవాళ మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజూరాబాద్ - హన్మకొండ రూట్లో వెళ్తున్న TS 02 UC 5936 నంబర్ గల ఈ బస్సు ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమ వైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయని, ఈ ప్రమాదంలో బస్సు కొద్దిగా డ్యామేజ్ అయిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
-
పత్రికా ప్రకటన
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
తేది: 24.12.2023
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజురాబాద్-హన్మకొండ రూట్ లో వెళ్తున్న TS02UC5936 నంబర్ గల ఆ బస్సు.. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా…
">పత్రికా ప్రకటన
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 24, 2023
తేది: 24.12.2023
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజురాబాద్-హన్మకొండ రూట్ లో వెళ్తున్న TS02UC5936 నంబర్ గల ఆ బస్సు.. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా…పత్రికా ప్రకటన
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 24, 2023
తేది: 24.12.2023
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ఆదివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. హుజురాబాద్-హన్మకొండ రూట్ లో వెళ్తున్న TS02UC5936 నంబర్ గల ఆ బస్సు.. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఎడమవైపున్న రెండు టైర్లు ఒక్కసారిగా…
ఒక్కసారిగా ఊడిన ఆర్టీసీ బస్సు వెనక టైర్లు - తప్పిన పెను ప్రమాదం
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారని సజ్జనార్ తెలిపారు. అద్దె బస్సు డ్రైవర్ రాజు అప్రమత్తమై బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. బస్సు ప్రమాద ఘటనపై వెంటనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
Sajjanar reacts on Huzurabad Depot Bus Accident Today : హుజూరాబాద్ డిపోకు చెందిన అద్దె పల్లె వెలుగు బస్సు ఓవర్ లోడింగ్ వల్లే ప్రమాదానికి గురైనట్లు వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రమాద సమయంలో బస్సు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందని, అప్పుడు బస్సుల్లో 42 మంది ప్రయాణికులున్నారని తెలిపారు. ప్రమాదం జరగగానే బస్సులోని 42 మందిని సురక్షితంగా మరొక బస్సులో ఆర్టీసీ(TSRTC) అధికారులు పంపించారన్నారు.
అలాంటి వారంతా పల్లె వెలుగు బస్సులు ఎక్కండి - మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రమాద సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు జరుగున్న ప్రచారం అవాస్తవం అన్నారు. అద్దె బస్సు ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. అద్దె బస్సుల నిర్వహణ విషయంలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని, తరచూ తనిఖీలు చేస్తూ తమ బస్సులను ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవాలని సూచించారు. బస్సుల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాలు సంభవిస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు.
స్టాప్ వద్ద బస్సు ఎందుకు ఆపలేదు? - ఆర్టీసీ డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తుల దాడి