రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద ఆర్టీసీ ఐకాస నేతలు నివాళులర్పించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు పోలీసులను ప్రతిఘటించడంతో.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ ముఖ్యనేతలు రాకముందే గన్‌పార్క్ వద్దకు చేరుకున్న తమను ఇలా అరెస్ట్ చేయడం సరికాదన్నారు ఆర్టీసీ ఉద్యోగులు.
ఇదీ చదవండిః సడలని సర్కార్... మూడో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె