హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు రాజిరెడ్డి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.
ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం రాజిరెడ్డి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
- ఇదీ చూడండి : 'వెనక్కు తగ్గేదిలేదు... దీక్ష విరమించే ప్రసక్తేలేదు'