ETV Bharat / state

ఆగని ఆర్టీసీ కార్మికుల బలిదానాలు - CM KCR on RTC strick

తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికుల బలిదానాలు ఆగడంలేదు. మొన్న ఖమ్మంలో డ్రైవర్​ శ్రీనివాస్​ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా హైదరాబాద్​ కార్వాన్​లో కండక్టర్​ సురేందర్​ గౌడ్​ బలన్మరణానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగం కోల్పోయాననే బాధతో ఉరి వేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్మికుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆర్టీసీ ఐకాస నేతలు, రాజకీయ పార్టీలు డిమాండ్​ చేస్తున్నాయి.

సురేందర్​ గౌడ్​
author img

By

Published : Oct 14, 2019, 6:41 AM IST

Updated : Oct 14, 2019, 3:50 PM IST

ఆగని ఆర్టీసీ కార్మికుల బలిదానాలు

ఆర్టీసీ కార్మికుల ఆత్మబలిదానాలు ఆగడంలేదు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్​ శ్రీనివాస్​ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా హైదరాబాద్​ కార్వాన్​లో ఆర్టీసీ కండక్టర్​ సురేందర్​ గౌడ్​ బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఉరి వేసుకుని

కార్వాన్‌ ప్రాంతంలో నివసించే సురేందర్‌ గౌడ్‌, రాణిగంజ్‌ డిపోలో గత 15 ఏళ్లుగా కండక్టరుగా పనిచేస్తున్నాడు. తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పపత్రికి తరలించగా అప్పటికే సురేందర్​ గౌడ్​ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఉద్యోగం పోయిందన్న మనస్తాపంతో సురేందర్‌ గౌడ్​ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

ప్రభుత్వమే కారణం

ఆర్టీసీ కార్మికుల బలిదానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్​ చేస్తున్నాయి. కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తోందని మండిపడ్డాయి.

ఇదీ చూడండి : "శ్రీనివాసరెడ్డిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..."

sample description
Last Updated : Oct 14, 2019, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.