ETV Bharat / state

బంద్​కు మద్దతుగా పలుచోట్ల నిరసనలు

ఆర్టీసీ ఐకాస బంద్​కు మద్దతుగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు చేపట్టాయి. ప్రభుత్వం పట్టుదలకు పోవద్దని కోరాయి. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ముక్తకంఠంతో డిమాండ్​ చేశాయి. ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

నిరసనలు
author img

By

Published : Oct 19, 2019, 8:01 PM IST

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బషీర్​బాగ్​లో పీడీఎస్​యూ ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హక్కులను కాలరాస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు.

జేబీఎస్ వద్ద 200 మంది అరెస్ట్

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 200 మందిని అరెస్ట్​ చేశారు.

మెహదీపట్నంలో ఉద్రిక్తత

మెహదీపట్నం డిపో వద్ద ఆందోళనకు యత్నించిన సుమారు 50 మంది ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ గ్రౌండ్​కు తరలించారు.

బస్ టైర్​లో గాలి తీసేసిన కార్మికులు

సికింద్రాబాద్​లోని తివోలి జంక్షన్ వద్ద ఆర్టీసీ కార్మికులు బస్​ను ఆపి టైర్​లో గాలి తీశారు. భయపడిన ప్రయాణికులు బస్సు దిగి వెళ్లిపోయారు. కాచిగూడ, బర్కత్​ పుర బస్ డిపోల వద్ద బంద్ ప్రశాంతంగా ముగిసింది. కాచిగూడ బస్ డిపో వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన 15 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్​కు తరలించారు. బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం బషీర్​బాగ్ కూడలిలో ఆందోళనకు దిగి... ఆర్టీసీ బస్​ను అడ్డుకుంది. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

సమ్మెకు ఉద్యోగ సంఘాల మద్దతు

సమ్మెకు ఉద్యోగ సంఘాల మద్దతుహైదరాబాద్ బషీర్​బాగ్​ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు టీఎన్జీవో నగర శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు మధ్యాహ్న విరామ సమయంలో నిరసన చేపట్టారు.

బైక్ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు

హిమాయత్ నగర్​లో సీపీఐ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ భవన్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. సమ్మెకు మద్దతుగా ఓయూలోని విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు.

బంద్​కు మద్దతుగా పలుచోట్ల నిరసనలు

ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.