ETV Bharat / state

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనలు: అశ్వత్థామరెడ్డి - భవిష్యత్ కార్యచరణను ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు

హైదరాబాద్​లో ఆర్టీసీ జేఏసీ , విపక్ష నేతలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగా ఇవాళ ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసన చేపట్టనున్నట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనలు: అశ్వత్థామరెడ్డి
author img

By

Published : Nov 11, 2019, 5:08 AM IST

Updated : Nov 11, 2019, 7:54 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఇవాళ ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. హైదరాబాద్​లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ , విపక్ష నేతలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణను ఐకాస నేతలు ప్రకటించారు.

మంగళవారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్​తో పాటు మరో ముగ్గురు కో కన్వీనర్లతో కలిసి ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహారదీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో ప్రాణత్యాగం చేసిన కార్మికులతో పాటు ఛలో ట్యాంక్​బండ్ సందర్భంగా గాయపడిన కార్మికుల ఫోటోలను ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. దిల్లీలో మానవ హక్కుల సంఘానికి, మహిళా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా సడక్​ బంద్​ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్చలకు పిలవాలని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనలు: అశ్వత్థామరెడ్డి

ఇదీ చదవండిః ఆర్టీసీ సమ్మె: 12 నుంచి నిరవధిక నిరాహార దీక్ష

TG_HYD_01_11_RTC_AGITATIONS_AB_3182388 reporter : sripathi.srinivas నోట్ : ఫీడ్ 3G నుంచి వచ్చింది. ( ) ఆర్టీసీ జేఏసీ ఆందోళనల్లో భాగంగా ఇవాళ ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి పేర్కొన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు, విపక్ష నేతలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి..ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణను ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. 12న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ తో పాటు, మరో ముగ్గురు కో-కన్వీనర్లతో కలిసి ఇంధిరాపార్క్ వద్ద నిరవదిక నిరాహారధీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఇంధిరాపార్క్ వద్ద నిరాహారధీక్షకు అనుమతి ఇవ్వని పక్షంలో ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ధీక్ష చేపడతామన్నారు. ఈనెల 14,15 తేదీల్లో చనిపోయిన కార్మికుల ఫోటోలతో పాటు, ఛలో ట్యాంక్ బండ్ సందర్బంగా గాయాలపాలైన కార్మికుల ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. వీటితో పాటు ఢిల్లోని మానవ హక్కుల సంఘానికి, మహిళా హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని ఆర్టీసీ జేఏసి నేతలు వెల్లడించారు. ఈనెల 18వ తేదీన సడక్ బంద్ ను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. బైట్ : అశ్వద్దామరెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్.
Last Updated : Nov 11, 2019, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.