ETV Bharat / state

దేశవ్యాప్తంగా ఆర్​ఎస్​ఎస్ సహాయ కార్యక్రమాలు

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు సహకారం అందించటంతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు దేశ వ్యాప్తంగా అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని ఆర్​ఎస్​ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవహ కాచం రమేశ్ తెలిపారు.

rss workers help to lot of people
దేశవ్యాప్తంగా ఆర్​ఎస్​ఎస్ సహాయ కార్యక్రమాలు
author img

By

Published : Apr 7, 2020, 8:38 PM IST

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు దేశ వ్యాప్తంగా అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని ఆర్​ఎస్​ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవహ కాచం రమేశ్ తెలిపారు. దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా విపత్తు, ప్రమాదం సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించడానికి స్వయంసేవకులు ముందుంటారని చెప్పారు.

26 వేల స్థలాల్లో 2 లక్షల మంది స్వయం సేవకులు

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్​డౌన్ మూలంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వారికి తగిన సహాయం అందించడానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్వయంసేవకులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 26 వేల స్థలాల్లో 2 లక్షల మంది స్వయంసేవకులు 25 లక్షల కుటుంబాలకు సాయం చేశారని వివరించారు.

25 వేల కుటుంబాలకు సాయం

తెలంగాణలో 369 చోట్లు వివిధ కార్యక్రమాల ద్వారా 2,678 మంది స్వయసేవకులు 25 వేల కుటుంబాలను ఆదుకున్నారని చెప్పారు. ఆర్​ఎస్ఎస్ సేవావిభాగమైన సేవాభారతితోపాటు అనేక ఇతర సంస్థలతో కూడా కలిసి స్వయంసేవకులు పనిచేస్తున్నారని తెలిపారు. పేదలకు భోజన సదుపాయం కల్పించడం, ఉప్పు, నూనె, పప్పు, మొదలైన నిత్యవసర వస్తువులతో కూడిన కిరాణా సామాను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు స్వయంసేవకులు చేస్తున్నారని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా ఆర్​ఎస్​ఎస్ సహాయ కార్యక్రమాలు

ఇది చూడండి: డ్రోన్​ వీడియో: హైదరాబాద్​ను ఇలా ఎప్పుడైనా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.