బ్రహ్మశ్రీ డా.మాడుగుల నాగఫణి శర్మ రచించిన సంస్కృతి మహాకావ్యం 'విశ్వభారతం' పుస్తకావిష్కరణ హైదరాబాద్ మాదాపూర్ అవధాన సరస్వతీ పీఠంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖండ భారత్ నుంచి విడిపోయిన ఏ దేశానికి చెప్పుకోవడానికి చరిత్ర లేదని.. భారత్ నుంచి విడిపోయిన ఏ దేశం సుఖశాంతులతో లేదని మోహన్ భగవత్ అన్నారు.
అందరూ కలిసి కృషి చేస్తే అఖండ భారతం ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. విశాల హిందుస్థాన్‌లో ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రపంచ దేశాలు మనవైపే చూస్తున్నాయని, ఇండియాతో వ్యాపార సంబంధాల కోసం ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. విశ్వభారత మహాకావ్యం భారతీయ భక్తి, సంస్కృతికి అద్దం పడుతోందని, దీన్ని పాఠ్యాంశంలో చేర్చాలని కోరారు.
- ఇదీ చూడండి : సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయొద్దు: జానారెడ్డి